365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 20,2024:విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఏప్రిల్ 21తేదీ న, మహావీర్ జయంతి సందర్భంగా కబేలా సెలవు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆదివారం తప్పనిసరిగా అన్ని కబేళాలు, మాంసం దుకాణాలను మూసివేయాలని కమిషనర్ ఆదేశించారు.ఈ మేరకు ఆదివారం ఎవరూ మాంసం విక్రయించకూడదు. అందువల్ల ఆదివారం నగరంలో ఎక్కడా నాన్ వెజ్ షాపులు తెరవవు అన్నారు.
నిబంధనలు ఉల్లంఘించి మాంసం విక్రయించే దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని విఎంసీ కమిషనర్ స్వప్నిల్ తెలిపారు. కావున దుకాణ యజమానులు, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
సోమవారం (ఏప్రిల్ 22) అన్ని కబేళాలు, మాంసం దుకాణాలు యథావిధిగా తెరవవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also read : Spotify launches RADAR Punjabi and Fresh Finds Punjabi for emerging artists to showcase their music..
ఇది కూడా చదవండి: టాటా మహీంద్రా MGకి పోటీగా ఫోర్డ్ ఎండీవర్ SUV..
ఇది కూడా చదవండి: రోగనిరోధక శక్తిని పెంచే 4 సహజ ఆహారాలు పదార్దాలు..