Sat. Dec 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 26,2024:ఫ్రాన్స్‌లోని విమానాశ్రయం లో టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు.CEO పావెల్ దురోవ్ అరెస్టును అనుసరించి, టెలిగ్రామ్ సంస్థ ఒక ప్రకటనలో స్పందించింది.

శనివారం రాత్రి 8 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఫ్రాన్స్‌లోని లే బోర్గెట్ విమానాశ్రయంలో పావెల్ దురోవ్‌ను అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల రవాణా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలతో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లో నేర కార్యకలాపాలను అరికట్టడంలో విఫలమవ్వడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

టెలిగ్రామ్ ఈ అరెస్టును అసంబద్ధంగా అభివర్ణించింది. “టెలిగ్రామ్ పరిశ్రమ ప్రమాణాలకు లోబడి పనిచేసే సంస్థ. కంపెనీ యూరోపియన్ యూనియన్ చట్టాలకు అనుగుణంగా ఉంటుంది,” అని ఫైనాన్షియల్ టైమ్స్ ద్వారా ప్రకటన విడుదల చేసింది.

టెలిగ్రామ్ యూరోపియన్ యూనియన్ చట్టాలలో ఉన్న డిజిటల్ సర్వీసెస్ చట్టాన్ని అనుసరించి, ప్లాట్‌ఫారమ్‌లో హానికరమైన కంటెంట్,తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి కట్టుబడి ఉందని తెలిపింది.

ఈ అరెస్టుపై ప్రముఖ బిలియనీర్ X (మాజీ ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. “ఈరోజు టెలిగ్రామ్. రేపు X,” అంటూ దురోవ్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు.

error: Content is protected !!