365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 6,2022: సనత్‌నగర్, భరత్‌నగర్ రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం ఉదయం పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన దురదృష్టకరం. అరవై ఏళ్ళ వయసున్న వ్యక్తిగా గుర్తించారు.
బాధితుడు రైలు పట్టాలు దాటుతుండగా, రైలు వేగంగా వస్తున్నట్లు గమనించి పక్కకు తప్పుకోబోతు కిందపడిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తు న్నారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.