Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, అమరావతి, అక్టోబర్ 20, 2022: ఈనాడు అధినేత రామోజీరావుపై వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ లో రోజుకో ఎపిసోడ్ ను పంచుకుంటున్నారు. అవన్నీ ఆయన మాటల్లోనే.. 2004 పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమిని రాము పసికట్టలేకపోయారు. కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకత్వాన సంకీర్ణ ప్రభుత్వం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధానిగా ఏర్పడుతుందని మొదట తెలియగానే కుల రాజగురువు కంగారుపడిపోయారు.

YCP_MP-Vijay-sai-reddy

Source from twitter

తాను 8 ఏళ్లకు పైగా ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అడ్డగోలుగా సమర్ధించానని, కాబట్టి తన వ్యాపారసంస్థల్లోని లోటుపాట్ల వల్ల తనకేమైనా ఇబ్బందులు వస్తాయనే ఆలోచన రాముకు రాలేదు. కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ యూపీఏ సర్కారుకు సోనియా జీ నాయకత్వం వహించడంపై ఆయన ఎక్కువ దిగులుపడ్డారు.

ఈ విషయాన్నే ప్రఖ్యాత జర్నలిస్టు కులదీప్‌ నయ్యర్‌ తన ఆత్మకథలో ప్రస్తావించారు. ‘‘కష్టపడి పైకొచ్చిన రామోజీ నాకు ఐదేళ్లుగా స్నేహితుడు. 2004 ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆయన నాకు ఫోన్‌ చేశాడు. ‘భారతదేశాన్ని ఒక ఇటాలియన్‌ పరిపాలించే దుస్థితి రాకుండా మీరు నివారించండి,’ అని ఆయన నన్ను అడిగాడు,’ అని నయ్యర్‌ ఈ పుస్తకంలో వివరించారు.

YCP_MP-Vijay-sai-reddy

రాము జీవితాన్ని కుదిపేసిన పరిణామం 2004లో ఏపీలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి నాయకత్వాన తొలిసారి ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఏపీ అవతరించాక ఎన్నికల నుంచి ఎన్నికల వరకూ వరుసగా ఐదేళ్లు ఏ కాంగ్రెస్‌ సీఎం అధికారంలో కొనసాగలేదు, ‘ వైఎస్‌ కూడా ఎన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారులే’ అనే ధీమాతో ఈనాడులో అబద్ధాలు, అర్థసత్యాలతో ‘కథనాలు’ మొదలుబెట్టించారు రాచపుండు రాము.

Source from twitter

Source from twitter

ఈ క్రమంలోనే ఎలాంటి బోర్డు లేకుండా నడుస్తున్న తన కుటుంబ సంస్థ ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ పై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు మొదలయ్యేటప్పటికి ఆయన స్పృహలోకి వచ్చారు. తన సంస్థలోని లొసుగులు దాచిపెట్టి వైఎస్‌ సర్కారుపై నిందలు వేసే ప్రయత్నం చేసి రాము అభాసుపాలయ్యారు. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, తెల్ల బూట్లు తొడుక్కునే రాజగురువు బట్టల నిండా నల్ల బురదే జనానికి కనిపించింది అని వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి అన్నారు.
 

error: Content is protected !!