Thu. May 2nd, 2024
onion_price

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ, ఫిబ్రవరి 27, 2023: ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్‌లో ఉల్లిధరలు దారుణంగా పడిపోయాయి. మహారాష్ట్రలోని లాసల్‌గావ్ వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీలో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఉల్లి వేలాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు.

ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్‌ అయిన లాసల్‌గావ్‌ ఏపీఎంసీలో ఇటీవలి కాలంలో ఉల్లి ధరలు కిలో రెండు నుంచి నాలుగు రూపాయలు పలుకుతున్నాయి.

ఉల్లి ధరలు వరుసగా పడిపోవడంతో విసుగు చెందిన రైతులు మార్కెట్ లో ఉల్లి విక్రయాలను నిలిపివేశారు. మహారాష్ట్రలోని లాసల్‌గావ్ వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీలో ఆగ్రహం చెందిన రైతులు ఉల్లి వేలాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు

రైతులకు క్వింటాల్‌కు రూ.1500 నష్టపరిహారాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, వారి ఉల్లిగడ్డలను కిలో రూ.15 నుంచి 20 చొప్పున కొనుగోలు చేయాలని ఉల్లిరైతుల ప్రతినిధి అన్నారు.

అలా చేయకుంటే లాసల్‌గావ్‌ హెచ్‌పీఎంసీలో వేలం కొనసాగించేందుకు అనుమతించబోమన్నారు. ఈ ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది.

సోమవారం లాసల్‌గావ్‌ మార్కెట్ తెరిచినప్పుడు కనిష్ట ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.200కి చేరింది. ఈ సమయంలో ఉల్లి గరిష్ట ధర క్వింటాల్‌కు రూ.800 ఉండగా, సగటు ధర క్వింటాల్‌కు రూ.400 నుంచి 450 వరకు పలికింది. ఉల్లి రైతులు క్వింటాల్‌కు రూ.1500 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు

శనివారం నాటికి ఏపీఎంసీకి 2404 క్వింటాళ్ల ఉల్లి విక్రయానికి వచ్చాయి. అప్పుడు ఉల్లి కనీస ధర క్వింటాల్‌కు రూ.351. కాగా క్వింటాల్‌ గరిష్ట ధర రూ.1231గా ఉంది. శనివారం ఉల్లి సగటు ధర క్వింటాల్‌కు రూ.625గా ఉంది.

మహారాష్ట్ర రాష్ట్ర ఉల్లి రైతుల నాయకుడు భరత్ డిఘోలే మాట్లాడుతూ.. ప్రస్తుత విధానసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఉల్లి రైతులకు క్వింటాల్‌కు రూ.1500 నష్టపరిహారాన్నితక్షణమే ప్రకటించాలని, ఉల్లిని రూ.3కే కొనుగోలు చేయాలని అన్నారు.


క్వింటాల్‌కు 4కి.. కిలో రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్న ఉల్లిని కొనుగోలు చేసి రైతులకు ఊరట కల్పించాలని ఆయన కోరారు.