Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 18,2023:హైదరాబాద్ నగరంలో మొదటి వెండి ఆభరణాల బ్రాండు ఒరాఫో జ్యుయల్స్. 2018 లో ఒరాఫో వారి మొదటి షోరూం సోమాజిగూడ, హైదరాబాద్ వద్ద ప్రారంభించారు.

92.5 విలువైన వెండి ఆభరణాల ఉత్పత్తులను ఒరాఫో బ్రాండ్ పేరిట విక్రయిస్తున్నాది. ఒరాఫో గత అయిదు సంవత్సరాలుగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ప్రతి వేడుకకు ప్రతి మహిళ కోరుకునే అద్భుతమైన కళాత్మకతతో రూపొందిన వెండి ఆభరణాలు అందించాలనే అభిలాషతో సుచిత్ర క్రాస్ రోడ్స్ వద్ద రెండవ షోరూం, AS.రావు నగర్ మెయిన్ రోడ్ వద్ద మూడవ షోరూం ఒరాఫో ప్రారంభించింది.

ప్రస్తుత పోకడలకు ( ట్రెండ్స్ ) అనుగుణంగా ఒరాఫో ఈరోజు ఆన్ లైన్ ద్వారా ఆభరణాలను కొనుగోలు చేసే ప్రత్యేక ఇ-కామర్స్ వెబ్ సైట్ ను సోమాజిగూడ సర్కిల్ వద్ద నున్న ఫ్లాగ్ షిప్ షోరూం లో ఆవిష్కరించినది. ఈ వెబ్ సైట్ ను కుమారి కావ్య కళ్యాణ్ రాం, సినీ నటి బలగం మూవీ ఫేం ఆవిష్కరించారు. ఒరాఫో జ్యువెల్స్ తన స్వతంత్ర ఇ-కామర్స్ వెబ్‌సైట్ www.orafojewels.in ప్రారంభించింది.

ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు తమకు నచ్చిన వెండి ఆభరణాలను ఎక్కడనుంచి అయిన ఈ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం కలుగు తుంది.

ఈసందర్భంగా ఒరాఫో జ్యుయల్స్ డైరక్టర్ కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం కస్టమైజ్డ్ డిజైనర్ విలివైన ఆభరణాలు కొనుగోలుచేసే నూతన విధానానికి తెరతీసాము అన్నారు.

ఇప్పుడు AS రావు నగర్ మెయిన్ రోడ్ , హైదరాబాద్ లోని మా మూడవ షోరూం ద్వారా తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్ అంతటా ఫ్రాంచైజీ పద్దతిలో త్వరలో ప్రత్యేక షోరూంలు ప్రారంభిస్తామని వెల్లడించారు.

బంగారం ధరలు పెరగటం, ఖాతాదారుల ఆర్ధిక వ్యవస్తను దెబ్బతీయడం వంటి కారణాలతో వెండి ఆభరణాలకు బాగా గిరాకి పెరిగింది. బంగారు ఆభరణాలకు బదులుగా వినూత్న రీతిలో వెండి ఆభరణాలు వస్తున్నాయి.

ఒరాఫో గత అయిదు సంవత్సరాలుగా ఏటా 25శాతం స్థిరమైన వృద్ధిని సాదిస్తున్నాది. వెండి ఆభరణాల విభాగాలో ఒరాఫో సుస్థిరతను బ్రాండ్ ఇమేజ్ సాధించినది. కనుకనే ఆశాజనకమైన,లాభదాయకమైన ఈ వ్యాపారంలో అడుగు పెట్టుటకు ఆసక్తికల యజమానులను ఒరాఫో ఆహ్వానిస్తున్నాది. రాబోయే 3 సంవత్సరాలలో దక్షిణ భారత దేశంలో 25 షోరూమ్ లు ప్రారంభించాలనే లక్ష్యం కలిగి ఉన్నది.

వెబ్ సైట్ ప్రత్యేకతలు : యూజర్ ఫ్రెండ్లీ అండ్ డిజైన్ రిచ్ వెబ్‌సైట్, ఆభరణాల రకాలు సులభమైన సమాచారం, వీడియో కాల్ సౌకర్యం స్లాట్ బుకింగ్ ద్వారా కలెక్షన్‌లను చూసే సౌకర్యం, అన్ని చెల్లింపుల గేట్‌వేలు అందుబాటులో ఉన్నాయి.

భారతదేశంలో ఉచిత షిప్పింగ్, అంతర్జాతీయ షిప్పింగ్ సౌకర్యం కలదు. ఒరాఫో 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా తమ విలువైన ఖాతాదారులకు ఎంపిక చేసిన ఆభరణాలపైన 18శాతం వరకు తగ్గింపు అందించడమేకాకుండా లక్కీ డిప్ ద్వారా అయిదుగురు ఖాతాదారులకు ఒక్కొక్కరికి 250 గ్రాముల వెండి నాణాలు ఉచితంగా అందిస్తుంది.

జీవిత కాల నిర్వహణ సౌకర్యం, తిరిగి కొనుగోలు (మార్పిడి) సౌకర్యం, NRI కస్టమర్ల కు అందుబాటులో డిజైన్ల డిజిటల్ కేటలాగ్, వీడియో కాల్ ద్వారా షాపింగ్ సౌకర్యం వంటివి అందుబాటులో ఉంటాయి.