365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 14, 2021: ఉస్మానియా యూనివర్సిటీ లోగోను టిఆర్ఎస్ ప్రభుత్వం మార్చ లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సోమవారం నాడు పత్రికా ప్రకటనలో తెలియజేశారు . ఉస్మానియా యూనివర్సిటీ లోగో ను టి ఆర్ ఎస్ ప్రభుత్వం మార్చి వేసిందని కొందరు నాయకులు చేస్తున్న విమర్శలపై హోంమంత్రి స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సెక్యులర్ నాయకుడని అన్ని మతాలను సమానంగా గౌరవించే ముఖ్యమంత్రి అని హోంమంత్రి పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లోగో విషయమై వివరాలు తెలుసుకునేందుకు ఉస్మానియా యూనివర్సిటీ ఉర్దూ విభాగం శాఖాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ . ఏ. షు కూర్ కు బాధ్యతలను అప్పగించామని తెలిపారు.
ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం…..1951 వ సంవత్సరంలో లోగోలో కొంత మార్పు జరిగిందని తెలిపారు. అనంతరం 1960 వ సంవత్సరంలో లోగో ను పూర్తిగా మార్చి వేశారని, ఐతే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని అన్నారు. దానిని టిఆర్ఎస్ ప్రభుత్వానికి అంటగట్టడం అవివేకమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కొందరు అనవసరంగా నిందల వేస్తున్నారని, ఇది నిజం కాదని హోంమంత్రి అన్నారు. 1960 సంవత్సరం తరువాత ధృవపత్రాలు ఉన్నవారు “లో గో” ను గమనించవచ్చని, నిరాధారమైన వార్తలను నమ్మవద్దని హోం మంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.