365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, డిసెంబర్ 31,2025: అత్తాపూర్‌లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ తమ 15వ వార్షిక క్రీడోత్సవాన్ని ‘ఖేల్ మహోత్సవ్’ పేరుతో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు,సందర్శకులు కలిపి దాదాపు 2,000 మందికి పైగా హాజరైన ఈ వేడుక క్రీడా ఉత్సాహంతో కళకళలాడింది.

వేడుకలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు, స్కేటింగ్, యోగా ,అబాకస్ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. వీటితో పాటు కీబోర్డ్ సంగీతం , వివిధ లయబద్ధమైన డ్రిల్స్ ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పురస్కారాల ప్రదానం
వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలను అందజేశారు:

హౌస్ ఛాంపియన్షిప్స్: అకాడమిక్, స్పోర్ట్స్, లిటరసీ,ఆర్టిస్టిక్ విభాగాల్లో ఐదు ఇంటర్ హౌస్ ట్రోఫీలను ప్రధానం చేశారు.

బోర్డు టాపర్స్: 2025 సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ముగ్గురు విద్యార్థులను పతకాలతో సత్కరించారు.

క్రీడా విజేతలు: ఏడాది పొడవునా జరిగిన థ్రోబాల్, ఖో-ఖో, చెస్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

ఇదీ చదవండి :టీజీవో ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ పదవీ విరమణ..

ఇదీ చదవండి :According to Numerology: ఈ డేట్స్ లో పుట్టినవారికి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..?

Read this also: Hyderabad’s Deepa Jewellers Files for IPO to Raise Up to Rs.250 Crore..

Read this also: Bharat Forge Secures Milestone Rs. 1,661 Crore Contract for Indigenous Carbines..

ముఖ్య అతిథిగా విచ్చేశిన వైఎంసీఏ సికింద్రాబాద్ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ యూజిన్ జార్జ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను తమ జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని సూచించారు. గౌరవ అతిథి, అంతర్జాతీయ స్విమ్మింగ్ విజేత సంతోష్ చారి మాట్లాడుతూ.. నేటి కాలంలో గ్యాడ్జెట్ల వినియోగాన్ని (స్క్రీన్ టైమ్) తగ్గించి, శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అది విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందిస్తుందని తెలిపారు.

పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి అన్నపూర్ణ కోడూరు మాట్లాడుతూ.. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా, జట్టు కృషి,పట్టుదల వంటి నాయకత్వ లక్షణాలను అలవరుస్తాయని పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి అనురాధ సూరపరాజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

నయన మనోహరమైన ముగింపు నృత్యం, న్యూ ఇయర్ డిస్ప్లే’తో ఈ క్రీడా సంబరం ఘనంగా ముగిసింది.