365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యుస్,హైదరాబాద్,మార్చి 26,2025: పాలసీబజార్‌కు చెందిన పీబీ పార్ట్‌నర్స్ సంస్థ హైదరాబాద్‌లో తన ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘సంవాద్’ను నిర్వహించింది. భాగస్వాములు, ఉద్యోగుల మధ్య బంధాలను మరింత బలపరిచేందుకు, సేవా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో 60మందికి పైగా టాప్ ఏజెంట్ భాగస్వాములు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పీబీ పార్ట్‌నర్స్ సహ వ్యవస్థాపకుడు ధృవ్ సరిన్, ఆరోగ్య బీమా జాతీయ అమ్మకాల అధిపతి నీరజ్ అధాన, మోటార్ బీమా జాతీయ అమ్మకాల అధిపతి అమిత్ భడోరియా, కమర్షియల్ లైన్స్ ఇన్సూరెన్స్ జాతీయ అమ్మకాల అధిపతి రోహితాశ్వ మిశ్రా, జీవిత బీమా సేల్స్ అసోసియేట్ డైరెక్టర్ రాహుల్ మహేష్ మిశ్రా తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ధృవ్ సరిన్ మాట్లాడుతూ, ‘‘సంవాద్ కార్యక్రమం భాగస్వాముల అభిప్రాయాలను వినేందుకు, వారి అవసరాలను అర్థం చేసుకోవడానికి గొప్ప వేదిక. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశం విజయవంతమైంది. భాగస్వాముల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, వారికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం,’’ అని తెలిపారు.

ఈ సమావేశంలో సంస్థ భవిష్యత్తు ప్రణాళికలు, వినూత్న ఉత్పత్తులు, క్రాస్-సెల్ సేవల గురించి వివరించారు. పీబీ పార్ట్‌నర్స్ తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు, భాగస్వాములను శక్తివంతం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని సంస్థ పేర్కొంది.