Fri. Nov 8th, 2024
Pennam_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ 20 మార్చి2023: పెన్నమ్ ఫౌండేషన్, నెక్టల్ మెటా సహకారంతో, వినికిడి లోపం ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా ఉన్న కంటెంట్‌తో కూడిన 50 ట్యాబ్‌లను పంపిణీ చేయడం ద్వారా విద్యా రంగంలో విప్లవాన్ని తీసుకువచ్చింది.

వచ్చే 3 నెలల్లో మరో 50 ట్యాబ్‌లను కూడా అందించాలని ఫౌండేషన్ యోచిస్తోంది. సోమవారం బేగంపేటలోని హరిత ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యతిధిగా హాజరై చిన్నారులకు టాబ్స్ అందజేశారు.

టాబ్లెట్‌లలో 10వ తరగతి విద్యార్థుల కోసం ఆన్‌లైన్ లెర్నింగ్ మెటీరియల్స్ ఉంటాయి. లెర్నింగ్ మెటీరియల్స్ ,స్టేట్ బోర్డ్స్ ,సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్దేశించిన పాఠ్యాంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇ-లెర్నింగ్ మెటీరియల్‌ను ఇ-సైన్ మెటా యాప్ డెవలపర్‌లు రూపొందించారు.

E Sign Meta యాప్ ఇది వినికిడి లోపం ఉన్నవారి కోసం మెటీరియల్స్ అందించే డిజిటల్ సొల్యూషన్ యాప్.1 నుంచి 12 గ్రేడ్‌ చదువుతున్న వికలాంగ పిల్లలకు, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు బోధించడానికి ఇ-లెర్నింగ్ మెథడాలజీలను పరిచయం చేస్తుంది.


ఈ యాప్ వైకల్యాలున్న విద్యార్థులకు లెర్నింగ్ కంటెంట్‌ యాక్సెస్‌ను పొందడంలో సహాయపడుతుంది. వారి కెరీర్‌లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన విజ్ఞానం, నైపుణ్యాలను అందిస్తుంది.

Pennam_365

ఈ సందర్భంగా పెన్నామ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సోలునస్ ఇంక్. అండ్ కైరోస్ టెక్నాలజీస్ సీఈఓ సుధాకర్ పెన్నమ్ మాట్లాడుతూ, “పెన్నామ్ ఫౌండేషన్‌లో, మేము పనిచేసే సంఘాలను సానుకూలంగా ప్రభావితం చేయడానికి వినూత్న పరిష్కారాలను అన్వేషిస్తామని చెప్పారు.

వినికిడి లోపం ఉన్న విద్యార్థులు కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవడంలో, నేర్చుకోవడంలో సహాయపడే నాణ్యమైన కంటెంట్‌ పొందడానికి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి సాంకేతికతను ఉపయోగించుకోవడానికి నెక్స్ట్‌టల్ మెటాతో భాగస్వామిగా ఉన్నాము.. ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నామనిఆయన తెలిపారు.

ఈ యాప్ ద్వారా సంకేత భాషకు మద్దతు ఇచ్చే సబ్జెక్టుల కోసం టాప్-క్లాస్ డిజిటల్ ఎడ్యుకేషనల్ మెటీరియల్‌లను అందిస్తుంది. ఇది సమకాలీన అభ్యాస పద్ధతులకు అనుగుణంగా ఉంటుందని, వినికిడి లోపం ఉన్న నిరుపేద విద్యార్థులకు నేర్చుకునేందుకు సంపూర్ణ మద్దతు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నెక్స్టల్ మెటా సీటీఓ హేమంత్ మాట్లాడుతూ, వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు లెర్నింగ్ సొల్యూషన్స్ అందించడానికి పెన్నమ్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఆనందంగా ఉందని చెప్పారు.

Pennam_365

నిజ జీవిత సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను అందించడానికి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవచ్చని. ఈ సైన్ మెటా యాప్ వినికిడి లోపం ఉన్నవారి కోసం కష్టమైజ్డ్ కంటెంట్‌ను అందించడానికి సాంకేతికతను ఉపయోగించి, వ్యక్తిగతంగానేకాకుండా, వృత్తిపరంగా అభివృద్ధి చెందడంలో సహాయపడుతుందని” హేమంత్ తెలిపారు.

PennamFoundation_365

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతిహొళ్లి కేరి, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ డైరెక్టర్ బి. శైలజ, తెలంగాణ ప్రభుత్వ వికలాంగుల హక్కుల చట్టం అమలు కమిటీ రాష్ట్ర సలహా సభ్యుడు ఎం.శ్రీనివాసులు, నెట్‌వర్క్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ ఆర్గనైజేషన్స్ (NPdO) వ్యవస్థాపక సభ్యుడు ,క్వాల్‌కామ్ ఇంజనీరింగ్ సీనియర్ డైరెక్టర్ నితిన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!