365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 30,2023:ఫిజికల్ ఫిట్నెస్, మానసిక దృఢత్వం విద్యార్థులు విజయం సాధించటంలలో కీలకపాత్ర పోషిస్తాయని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ శ్రీమతి బి. నీరజా ప్రభాకర్ అన్నారు.
విద్యార్థుల కంటే విద్యార్థినిలకే ఫిజికల్ ఫిట్నెస్ అత్యంత అవసరమని పేర్కొన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల లోని ఉద్యాన కళాశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆటల, పోటీల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆమె విద్యార్థులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా… మాట్లాడుతూ.. క్రీడలు మానసిక వికాసానికి ఎంతో అవసరమని, మానసిక ఒత్తిడి లేని చదువులతో విద్యార్థులు ఇంకా ఎక్కువగా చదువులలో రాణిస్తారని వైస్ ఛాన్స్లర్ అన్నారు. దళాలు కళాశాలలు చదువులతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి.
ఒత్తిడి రహిత వాతావరణంలో విద్యార్థులు ఎక్కువగా నేర్చుకుంటారు. చదువుతోపాటు విద్యార్థులు ఈ అంశాలపై దృష్టి సాధించాలని డాక్టర్ నీరజా ప్రభాకర్ చెప్పారు.
ద్యెనందిన జీవితంలో క్రీడల్ని ఒక భాగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఫిజికల్ ఫిట్నెస్ కి, మానసిక వికాసానికి అవినాభావ సంబంధం ఉందని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహిస్తున్న ఫీల్డ్ ప్రాక్టికల్స్ ను సందర్శించి విద్యార్థులకు మెలకువలు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు విడుదల చేసిన కూరగాయ పంటల రకాలపై పరిశోధన నిర్వహించాలని, రైతులకు ఆ టెక్నాలజీ ఇవ్వాలని అన్నారు.
అనంతరం విద్యార్థులు ఏర్పాటుచేసిన సైన్స్ ఫెయిర్ ని తిలకించారు. సందర్భంగా వివిధ ఆటలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు వైస్ ఛాన్స్లర్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.
కార్యక్రమంలో డీన్ అఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ డి. విజయ, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్య, ఎస్టేట్ ఆఫీసర్ నాగేశ్వర్ రెడ్డి, ఓ ఎస్ ఏ డాక్టర్ షహనాజ్, డాక్టర్ జె. శంకర్ స్వామి, డాక్టర్ గౌతమి, డాక్టర్ విద్య, డాక్టర్ శ్రీనివాస్, చంద్రశేఖర్, ప్రొఫెసర్లు విద్యార్థులు పాల్గొన్నారు.