365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, అక్టోబర్ 19,2024:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన ఉప కులపతి గా నియమితులైన ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఈరోజు ఉదయం బాధ్యతలు చేపట్టారు.విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం లోని ఉపకులపతి ఛాంబర్ లో ఈ కార్యక్రమం జరిగింది.ఇన్ ఛార్జి ఉపకులపతి,రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపుల్ కార్యదర్శి,వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ ఎం.రఘునందనరావు,ఐ యే ఎస్ నుంచి జానయ్య బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమయ్యారు.ఇన్నాళ్ళూ ఇన్ ఛార్జి ఉప కులపతి గా విశ్వవిద్యాలయ పనితీరు మెరుగుపర్చటానికి సాధ్యమైనంత క్రిషి చేసానని రఘునందనరావు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం అత్యంత ప్రాధాన్యత రంగం అని ఆయన వివరించారు.
రైతాంగం,వ్యవసాయ రంగ సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నదని, విశ్వవిద్యాలయం ప్రభుత్వ లక్ష్యాలకి అనుగుణం గా పనిచేయాలన్నారు.అధునాతన టెక్నాలజీలని,డిజిటల్ విధానాలని అందిపుచ్చుకోవాలని రఘునందన రావు సూచించారు.
జాతీయ,అంతర్జాతీయ సంస్థల్లోనూ,వ్యవసాయ విశ్వవిద్యాలయం లోనూ ఇప్పటికీ 15 హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించానని ఉపకులపతి జానయ్య తెలిపారు.తాను ప్రతి హోదాను అధికారం లా కాకుండా బాధ్యత గా భావిస్తానని వివరించారు.
సమష్టి క్రిషి తో విశ్వవిద్యాలయాన్ని అగ్ర స్థానానికి తీసుకెళదామని జానయ్య పిలుపునిచ్చారు.బోధన,బోధనేతర సిబ్బంది ఉపకులపతి జానయ్య ని కలిసి పుష్ప గుచ్చాలు అందించి అభినందించారు.