![PURUSHAIVARI THOTA UTSAVA HELD IN TIRUMALA](http://365telugu.com/wp-content/uploads/2021/08/ttd3-4-1024x724.jpg)
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,ఆగస్టు 11,2021:సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు పురుశైవారితోటకు వేంచేపు చేశారు.అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు బయల్దేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి ఇచ్చారు.శేషహారతి, పుష్ప మాల, శ్రీ శఠారి పొగడ చెట్టునకు సమర్పించారు. శ్రీ శఠారికి అభిషేకం అనంతరం తిరిగి తిరుచ్చిపై ఉంచారు. అక్కడినుంచి స్వామి, అమ్మవార్లు తిరిగి ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.
![PURUSHAIVARI THOTA UTSAVA HELD IN TIRUMALA](http://365telugu.com/wp-content/uploads/2021/08/ttd2-4-1024x675.jpg)
పురాణాల ప్రకారం పాండ్య దేశంలో పరమ విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడికి చెందిన తులసీవనంలో ఆషాడ శుక్ల చతుర్థి నాడు పూర్వఫల్లునీ నక్షత్రంలో భూదేవి అంశగా ఆండాళ్(గోదాదేవి) అమ్మవారు ఆవిర్భవించారు. ఈ కారణంగా కటక మాసం పూర్వఫల్గుని నక్షత్రంలో ఆండాళ్ తిరువడిపురం శాత్తుమొర నిర్వహిస్తారు.
![PURUSHAIVARI THOTA UTSAVA HELD IN TIRUMALA](http://365telugu.com/wp-content/uploads/2021/08/ttd1-5-1024x860.jpg)
![PURUSHAIVARI THOTA UTSAVA HELD IN TIRUMALA](http://365telugu.com/wp-content/uploads/2021/08/ttd-7-1024x847.jpg)