Sat. Apr 20th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఫిబ్రవరి 23,2024: తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు ఇలా ఉన్నాయి.

వాతావరణ విశ్లేషణ Meteorological Analysis : (ఈ రోజు ఉదయం 08:30 ఆధారంగా)ఈ రోజు ఒక ఉపరితల ఆవర్తనం దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది.

ఒక ద్రోణి పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనం నుంచి రాయలసీమ పైగా దక్షిణ తమిళ నాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):

ఈ రోజు,రేపు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు.