Wed. Oct 16th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 24,2024:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం విభాగం వారు ‘ఎన్.ఎస్.ఎస్ డే’ ను ఘనంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా వాలంటీర్లు “స్వచ్ఛత హి సేవ”లో భాగంగా ప్లాస్టిక్ ని వినియోగించవద్దని, చెత్త-చెదారం,వ్యర్ధపదార్థాలను తొలగించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని అవగాహన ర్యాలీని నిర్వహించారు.

ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ వాలంటీర్లను ఉద్దేశించి ఇంతవరకు వారు చేసిన సేవా కార్యక్రమాలకు గాను వారిని అభినందించి, ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి దేశ సేవలో భాగమవ్వాలని తెలిపారు.

తదానంతరం వాలంటీర్లు ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాలను గురించి ప్లాష్ మాబ్ మరియు లఘునాటిక రూపంలో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సి. నరేంద్ర రెడ్డి, ఎ.ఇ.ఎల్.పి డైరెక్టర్స్, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

error: Content is protected !!