Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 4,2023: దర్శక రత్న దాసరి నారాయణరావు.. 150పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి అరుదైన రికార్డు నెలకొల్పిన గొప్ప డైరెక్టర్. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం..

దాసరి నారాయణరావు1972 సంవత్సరంలో తీసిన “తాత మనవడు” ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. దర్శకత్వ బాధ్యత చేపట్టిన మొట్టమొదటి చిత్రం ద్వారా దాసరి నారాయణరావుకి ఎంత పాపులారిటీ, ఇమేజ్, ఫాలోయింగ్, క్రేజ్ వచ్చిందో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా చెబుతారు.

దాసరి నారాయణరావు “తాత మనవడు’” సినిమా లో “మానవుడు” పాత్ర కోసం 1970 దశకంలోని ప్రముఖ హీరోలను సంప్రదిస్తే ఇలాంటి కామెడీ టైప్ ఎవరు చేస్తారు అని నిరాశ పరిచారు. కాని, కసి మీద ఉన్న దాసరి గారు రాజబాబునే హీరో పెట్టి హిట్టు కొడుతునని ఛాలెంజ్ చేసారు. ఆ తరువాత “తాత మనవడు’” సినిమా తిరుగులేని విజయం సాధించింది.

లైవ్ పబ్లిక్ షూట్ స్టిల్ ఫోటో: 1972 తాత మనవడు విజయోత్సవం సందర్భంలో… రాజబాబు, రమాప్రభ, దాసరి నారాయణరావు.. ‘తాత మనవడు’ సినిమా ముఖ్యంగా నటసింహం అభినయ చక్రవర్తి యస్వీ రంగారావు గారికి, దర్శకులు దాసరి నారాయణరావు గారికి, కథానాయకుడు రాజబాబు గారికి నిర్మాత రాఘవ గారికి ఊహించని స్థాయిలో 1972 నాటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ‘తాత మనవడు’ సినిమా..

ఈ సినిమా ఘన విజయం సాధించి సిల్వర్ జూబ్లీ తరువాత వరుసగా సంవత్సరం పాటు ఆడిన గొప్ప మూవీ గా నిలిచింది. ఈ సినిమాకి ఇంతటి సక్సెస్ కారణం దాసరి గారు ఎంచుకున్న సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ కథాంశమే.

తరువాత యస్వీరంగారావు, రాజబాబు గారు విలక్షణమైన సహజ నటన ప్రేక్షకులను థియేటర్లకు బారులు తీయించింది. అంజలీదేవి, కైకాల, విజయనిర్మల, అల్లు రామలింగయ్య, గుమ్మడి, ఛాయాదేవి లాంటి గొప్ప ఆర్టిస్టులందరనీ దాసరి గారు ఒకే సినిమాలో నటింపచేయడం విశేషం.

లైవ్ పబ్లిక్ షూట్ స్టిల్ ఫోటో: 1972 తాత మనవడు విజయోత్సవం సందర్భంలో… రాజబాబు, రమాప్రభ, దాసరి నారాయణరావు.. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా దాసరి నారాయణరావు గారు విజయోత్సవ సంబరాలు ప్రేక్షక, అభిమానుల సమక్షంలో చేద్దామని అనుకున్నారు. అల్లు వారిది, దాసరి వారిది పాలకొల్లు కావడం రాజబాబు గారిది రాజమండ్రి అందరు గోదావరి తీర వాసులు కావడంతో రాజమండ్రిలో ఈ సినిమా ఫంక్షన్ చేద్దామని నిర్ణయించారు.

దాసరి నారాయణరావు రాజబాబుతో అత్యధిక సినిమాల్లో నటించిన రమాప్రభను ప్రత్యేక అతిథిగా పిలిచారు. ఈ విషయంలో రమాప్రభ దాసరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే, తన సొంత సోదరుడి కంటే ఎక్కువైన రాజబాబు విజయాన్ని చూసే అదృష్టం దక్కిందని రమాప్రభ తెగ సంబరపడ్డారు.

ఈ సినిమా విజయోత్సవ సభ కాగానే రాజబాబుని రాజమండ్రి పట్టణం ప్రజల మధ్య ఊరేగించారు. రాజమండ్రి పుర వీధుల్లో ఊరేగించే సమయంలో ఒక అభిమాని ఒకే పూలమాలతో దాసరి గారితో రాజబాబు ను కలిపి సత్కరించాడు. ఛాలెంజ్ చేసిన విధంగా రాజబాబును హీరోగా పెట్టి ‘తాత మనవడు’ సినిమాతో హిట్ కొట్టారు..”దటీజ్ దాసరి”..