Thu. Sep 19th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 17, 2024: భారతదేశంలో సామ్‌సంగ్ బ్రాండ్ ఉచిత యాడ్-సపోర్టెడ్ స్ట్రీమింగ్ టీవీ (ఫాస్ట్) సర్వీస్ అయిన సామ్‌సంగ్ టీవీ ప్లస్ తన పోర్ట్‌ఫోలియోలో నాలుగు కొత్త ఛానెల్‌లను ప్రారంభించడా నికి ఇండియా టీవీ గ్రూప్‌తో జతకట్టింది.

ఈ భాగస్వామ్యంలో భాగంగా ఇండియా టీవీ గ్రూప్ కనెక్టెడ్ టీవీ (సీటీవీ) ప్రత్యేక ఛానెల్‌లు ఇండియా టీవీ, ఇండియా టీవీ స్పీడ్ న్యూస్, ఇండియా టీవీ ఆప్ కి అదాలత్, ఇండియా టీవీ యోగా ఇప్పుడు సామ్‌సంగ్ టీవీ ప్లస్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి.

వీక్షకులు ఇప్పుడు వార్తలు, కరెంట్ అఫైర్స్, ఫిట్‌నెస్, వినోదంలనుండి విస్తృతమైన అధిక నాణ్యత కంటెంట్ ఆఫర్‌లకు సులభంగా వీక్షించి ఆస్వాదించవచ్చు.

సామ్‌సంగ్ టీవీ ప్లస్ అనేది సామ్‌సంగ్ స్మార్ట్ టీవీలలో ముందే ఇన్‌స్టాల్ చేయబడిన ఉచిత స్ట్రీమింగ్ సేవ. ఎంపిక చేసిన దేశాలలో వార్తలు, క్రీడలు, వినోదం, మరిన్నింటితో సహా అనేక రకాల ఛానెల్‌లను అందిస్తోంది. భారతదేశంలో, సామ్‌సంగ్ టీవీ ప్లస్ వీక్షకులకు 100 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు, వేలకొద్దీ చలనచిత్రాలు, షోలకు లైవ్, ఆన్-డిమాండ్ రెండింటికీ యాక్సెస్ కల్పిస్తోంది.

“సామ్‌సంగ్ టీవీ ప్లస్ మా వీక్షకులకు ఫాస్ట్ ద్వారా అధిక-నాణ్యత కంటెంట్‌ను అందించడంలో ముందంజలో ఉంది. మా వినియోగదారులకు ఆసక్తికరంగా, ఉపయోగకరంగా ఉండే కంటెంట్‌ను అందించడానికి మేం మా నిబద్ధతలో స్థిరంగా ఉంటాం.

నాణ్యమైన,విభిన్నమైన కంటెంట్‌ను అందించాలనేది మా ఆశయం. ఇండియా టీవీ గ్రూప్ నుండి నాలుగు కొత్త ఛానెల్‌ల జోడింపు దీనికి నిదర్శనం” అని సామ్‌సంగ్ టీవీ ప్లస్ ఇండియా భాగస్వామ్య హెడ్ కునాల్ మెహతా అన్నారు.

“సామ్‌సంగ్ టీవీ ప్లస్ తో మా భాగస్వామ్యం వీక్షకుల కోసం కొత్త, విస్తృత మార్గాలను తెరుస్తుంది. విభిన్న వర్గాలకు చెందిన ప్రేక్షకులకు నాణ్యమైన, విభిన్నమైన, గొప్ప కంటెంట్‌ని అందించడానికి ఇది ఒక మెట్టు.

ఇండియా టీవీ, సామ్‌సంగ్ టీవీ ప్లస్‌ల కలయిక ఆన్‌లైన్ కంటెంట్ వినియోగం అనుభవాన్ని పునర్నిర్వ చించగలదని,మెరుగుపరుస్తుందని మేం ఆశాజనకంగా ఉన్నాం ” అని ఇండియా టీవీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ అమిత్ కుమార్ సిన్హా అన్నారు.

error: Content is protected !!