Sat. Nov 9th, 2024
SECOND EDITION OF AKHANDA BALAKANDA PARAYANAM HELD
SECOND EDITION OF AKHANDA BALAKANDA PARAYANAM HELD
SECOND EDITION OF AKHANDA BALAKANDA PARAYANAM HELD

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమల,సెప్టెంబ‌రు 28,2021: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై మంగ‌ళ‌వారం ఉద‌యం జరిగిన బాల‌కాండలోని 3 నుంచి 7వ‌ సర్గ వ‌ర‌కు ఉన్న మొత్తం 142 శ్లోకాలను వేద పండితుల అఖండ పారాయ‌ణంతో తిరుమ‌ల‌గిరులు మార్మోగాయి.

SECOND EDITION OF AKHANDA BALAKANDA PARAYANAM HELD
SECOND EDITION OF AKHANDA BALAKANDA PARAYANAM HELD

బాల‌కాండ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆధ్యాప‌కులు ఆచార్య ప్ర‌వా రామ‌క్రిష్ణ సోమ‌యాజులు మాట్లాడుతూ ‌మ‌న పూర్వీకులు మ‌న‌కు అందించిన దివ్య శ‌క్తి మంత్రోచ్ఛ‌ర‌ణ అని, దీనితో స‌మ‌స్త రోగాల‌ను న‌యం చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. కొన్ని వంద‌ల‌ సంవ‌త్స‌రాలుగా మాన‌వులు రామాయ‌ణం పారాయ‌ణం చేయ‌డం వ‌ల‌న బాధ‌లు తొల‌గి, సుఖ సంతోషాల‌తో ఉన్న‌ట్లు పురాణాల ద్వారా నిరూపిత‌మైన‌ద‌న్నారు. వాల్మీకి మ‌హ‌ర్షి శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తిని ఆశ్ర‌యించిన‌ట్లు, యావ‌త్ ప్ర‌పంచం రామనామం పలికితే స‌క‌ల శుభాలు సిద్ధిస్తాయ‌న్నారు.

SECOND EDITION OF AKHANDA BALAKANDA PARAYANAM HELD
SECOND EDITION OF AKHANDA BALAKANDA PARAYANAM HELD

ప్ర‌పంచ శాంతి, క‌రోనా మూడ‌వ వేవ్ నుంచి పిల్ల‌లు, పెద్ద‌లు అన్ని వ‌ర్గ‌లవారు సుఖ‌శాంతుల‌తో ఉండాల‌ని బాల‌కాండ పారాయ‌ణం నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. బాల‌కాండలోని శ్లోకాలను, విషూచికా మ‌హ‌మ్మారి నివార‌ణ మంత్ర పారాయ‌ణం ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు ఒకేసారి పారాయ‌ణం చేస్తే ఫ‌లితం అనంతంగా ఉంటుంద‌ని వివ‌రించారు.

SECOND EDITION OF AKHANDA BALAKANDA PARAYANAM HELD
SECOND EDITION OF AKHANDA BALAKANDA PARAYANAM HELD

అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నా‌రు.

SECOND EDITION OF AKHANDA BALAKANDA PARAYANAM HELD
SECOND EDITION OF AKHANDA BALAKANDA PARAYANAM HELD

ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి వంద‌న బృందం ” జ‌గ‌దానంద‌కార‌క – జ‌య జాన‌కీ ప్రాణ‌నాయ‌క ….. “, అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ప్రారంభంలో, ” రామ రామ రామ …..భ‌జే విశేష సుంద‌రం స‌మ‌స్త పాప ఖండ‌నం …….” అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ముగింపులో సుమ‌ధురంగా అల‌పించారు.

error: Content is protected !!