Sat. Dec 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 8 ,2024: హిందూ ఆధ్యాత్మిక & సేవా ఫౌండేషన్ (HSSF) ఆధ్వర్యంలో, హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గురువారం భవ్యమైన సేవాప్రదర్శిని ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో పలు ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, సేవావ్రతులైన వ్యక్తులు, మఠమందిరాలు, సమాజానికి సేవలు అందిస్తున్న సంస్థలు ఒకటయ్యాయి.

ఈ సేవాప్రదర్శిని ప్రారంభోత్సవంలో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి, రామకృష్ణ మిషన్ (విజయవాడ) నుండి స్వామి శితికంఠానంద, ఆర్.ఎస్.ఎస్. అఖిలభారత కార్యకర్తలు శ్రీభాగయ్య, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్, HSSF-IMCTF అఖిలభారత సంయోజకులు గుణవంత్ సింగ్ కొఠారి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

త్రిదండి చిన్నజీయర్ స్వామి ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, “ఈ సేవాప్రదర్శిని భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తుంది” అన్నారు. దేశానికి ఒక ఆత్మ ఉందని చూపించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటైందని, ప్రతి ఒక్కరూ దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారతదేశంలో విస్తృతమైన వనరులు ఉన్నప్పటికీ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విద్యావిధానంలో మార్పులు లేకపోయాయని దుఃఖం వ్యక్తం చేశారు. ఆయన చాటి చెప్పినట్లు, భారతదేశం సహజ సంపదలు, సౌందర్యం, రుచి కలిగి ఉన్న దేశమని పేర్కొన్నారు.

సేవా మార్గంలో మన రుషుల సూచనలను, వారి సూచనల ప్రకారం సేవ చేయడం, HSSF ద్వారా ఈ సేవలు సమాజానికి చేరువవడం ఎంతో ముఖ్యం అని రామకృష్ణ మిషన్ నుండి వచ్చిన స్వామి శితికంఠానంద పేర్కొన్నారు.

ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త శ్రీభాగయ్య కూడా భారతీయ సమాజపు మౌలిక స్థితిని మరియు HSSF సేవాప్రదర్శిని భారతీయతను ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు.

HSSF-IMCTF అఖిలభారత సంయోజకులు గుణవంత్ సింగ్ కొఠారి ఈ సేవాప్రదర్శినిని ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమంగా వర్ణించారు. ఇది హైందవ ధర్మంలోని సేవా పరమైన లక్షణాలను చాటిచెప్పడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం అని చెప్పారు.

సభకు అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ పూర్వ చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ సేవాప్రదర్శిని ద్వారా మన దేశపు నిజమైన పౌరసత్వం తెలియజేయబడుతుందని చెప్పారు. మనం తెలుసుకోవాల్సిన అసలైన చరిత్రను గుర్తించి, ఈ మేళాలో పాల్గొనే సంస్థలు, వ్యక్తులు అందించిన సేవల స్ఫూర్తిని ఆమోదించాలని ఆయన తెలిపారు.

error: Content is protected !!