365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 16,2023: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో నష్టపోయాయి. ముడి చమురు పెరుగుదలతో అంతర్జాతీయంగా నెగెటివ్ సెంటిమెంటు ఎగిసింది. ఆసియా, ఐరోపా మార్కెట్లు తల్లడిల్లుతున్నాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు వరుసపెట్టి అమ్మకాలు చేపడుతున్నారు. నేడు ఎఫ్‌ఐఐలు రూ.594 కోట్ల మేర స్టాక్స్‌ను అమ్మేశారు. అయితే దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1184 కోట్ల మేర కొనుగోళ్లు చేపట్టి నెట్ బయర్స్‌గా మారారు. డాలర్ నానాటికీ బలంగా మారుతోంది.
యూఎస్ బాండ్ ఈల్డులు సైతం పెరిగాయి. నేడు నిఫ్టీ 19, సెన్సెక్స్ 115 పాయింట్ల మేర నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి రెండు పైసలు తగ్గి 83.26 వద్ద స్థిరపడింది.
క్రితం సెషన్లో 66,282 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెన్స్ నేడు 66,238 వద్ద మొదలైంది. అక్కడి నుంచి సాయంత్రం వరకు రేంజ్‌బౌండ్‌లోనే కొనసాగింది. 66,039 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 66,342 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది.
చివరకు 115 పాయింట్ల నష్టంతో 66,166 వద్ద ముగిసింది. సోమవారం 19,737 వద్ద ఆరంభమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19,691 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరింది. ఆపై ఒకే స్థాయిలో చలించి 19,791 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 19 పాయింట్ల నష్టంతో 19,731 వద్ద క్లోజైంది. ఇక బ్యాంకు నిఫ్టీ 62 పాయింట్లు పతనమై 44,225 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 50 కంపెనీల్లో 22 లాభపడగా 27 నష్టపోయాయి. హీరోమోటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, యూపీఎల్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. దివిస్ ల్యాబ్, నెస్లే ఇండియా, టీసీఎస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, అదానీ పోర్ట్స్ అత్యధికంగా నష్టపోయాయి.
రంగాల వారీగా చూస్తే ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్, బ్యాంకు సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంకు, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్స్ టెక్నికల్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,775 వద్ద రెసిస్టెన్సీ, 19,700 వద్ద సపోర్ట్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు స్వల్ప కాలంలో ఎల్‌టీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఐచర్ మోటార్స్, ఎంజీఎల్ షేర్లను కొనుగోలు చేయొచ్చు. నిఫ్టీ నష్టాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాయి.
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం త్రైమాసిక ప్రాతిపదికన 101 శాతం పెరిగింది. రూ.668 కోట్ల నికర లాభం నమోదు చేసింది. మార్కెట్లో నమోదైన తర్వాత కంపెనీ విడుదల చేసిన మొదటి ఫలితాలు ఇవే.
క్యూ2లో ఆదాయం రూ.608 కోట్లు, నికర వడ్డీ రూ.186 కోట్లుగా ఉంది. హెచ్‌డీఎఫ్సీ బ్యాంకు క్యూ2 లాభం 50 శాతం పెరిగి రూ.15,976 కోట్లుగా నమోదైంది. నెల్కో, జై బాలాజీ కంపెనీలు ఫలితాలు విడుదల చేశాయి.
హితేశ్ మహేశ్వర్‌ను ఇప్కా లేబోరేటరీస్ ఆర్ అండ్ డీ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఐఎన్‌ఎస్ బీస్ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ కొచిన్ షిప్‌యార్డ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మథర్‌సన్ సుమిలో 10.2 లక్షల షేర్లు చేతులు మారాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709.