365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 28,2025: ప్రఖ్యాత భారతీయ నటి శ్రుతి హాసన్ తన తొలి అంతర్జాతీయ చిత్రం ‘ది ఐ’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2, 2025 వరకు జరగనున్న 5వ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనుంది. ఈ వేడుకలో ‘ది ఐ’ చిత్రం భారతదేశం తరఫున ప్రీమియర్ కానుంది.
Read this also…What is the Difference Between the EB-5 Visa and the Gold Card Visa?
Read this also…What Impact Will Trump’s Announced Gold Card Plan Have on Indians?
ఇది కూడా చదవండి...EB-5 వీసా కంటే గోల్డ్ కార్డ్ వీసాలకు ఏంటి తేడా..?
ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్
ఈ కథ డయానా (శృతి హాసన్) అనే మహిళ తన భర్త ఫెలిక్స్ (మార్క్ రౌలీ) కోసం చేసే ప్రయాణాన్ని ఆధారంగా చేసుకుంది. చనిపోయిన తన భర్తను తిరిగి తీసుకురావాలనే ఆమె ప్రయత్నాలు ఆసక్తికరంగా సాగుతాయి.

ఇటీవల విడుదలైన టీజర్ ప్రకారం, ఈ చిత్రం అతీంద్రియ శక్తులు, భావోద్వేగాలు, మరియు థ్రిల్ కలగలిసిన వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకులను మెప్పించనుంది.
గ్రీస్ అందాలలో ‘ది ఐ’
ఈ సినిమా షూటింగ్ గ్రీస్‌లోని ఏథెన్స్, కోర్ఫు వంటి అద్భుతమైన లొకేషన్లలో జరిగింది. 2023లో లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్,గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించిన ‘ది ఐ’ గురించి అంతర్జాతీయంగా ఆసక్తి పెరిగింది.
ఇది కూడా చదవండి…భారతదేశంలో అభివృద్ధి చెందేందుకు పని గంటలు సహాయ పడుతున్నాయా..?
ఇది కూడా చదవండి…ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డ్ ప్లాన్ భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?
శృతి హాసన్ ఏమన్నారంటే…
ఈ సందర్భంగా శ్రుతి హాసన్ మాట్లాడుతూ -“సైకలాజికల్ థ్రిల్లర్‌లు ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తాయి. మానవ భావోద్వేగాలు, దుఃఖం, అతీంద్రియ శక్తుల అంశాలతో సినిమాలు చేయడం నాకు చాలా ఇష్టం.
మహిళల నేతృత్వంలోని ప్రొడక్షన్ హౌస్‌లో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోవడం విశేషం. మహిళలకు మద్దతుగా నిలిచే చిత్రాల్లో నటించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.” అని చెప్పారు.

దర్శకురాలు డాఫ్నే ష్మోన్ కామెంట్స్
దర్శకురాలు డాఫ్నే ష్మోన్ మాట్లాడుతూ -“డయానా పాత్రలో శ్రుతి హాసన్ అద్భుతంగా నటించారు. ఆమె ఎమోషనల్ డెప్త్, నటనలోని లోతు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఈ సినిమా ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపిస్తుంది.” అని ప్రశంసించారు.
ఈ సినిమా పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా షూట్ చేయడం విశేషం. ప్రకృతి పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని సినిమాలు నిర్మించడం భవిష్యత్ చిత్ర పరిశ్రమకు మార్గదర్శకంగా నిలుస్తుందని చిత్రబృందం తెలిపింది.
ఇది కూడా చదవండి…ప్రపంచంలో అత్యధిక పని గంటలు చేసే దేశాలు ఏవి..?
Read this also…Hyderabad Rises to Second Spot in India’s Office Leasing Market with Record 52% Growth in 2024
ఫింగర్‌ప్రింట్ గురించి
ఫింగర్‌ప్రింట్ కంటెంట్ అత్యుత్తమ కథనాలను ప్రేక్షకులకు అందించేందుకు కృషి చేస్తోంది. సామాజిక సమస్యలను తెరపైకి తీసుకురావడం, వివిధ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రాజెక్ట్‌లను రూపొందించడం సంస్థ లక్ష్యం.

ప్రపంచవ్యాప్తంగా సమానత్వం, వివిధ జాతులు, లింగ బేధాల నుంచి బయటపడే కథలను అందించేందుకు ఈ సంస్థ అంకితమై పని చేస్తోంది.
‘ది ఐ’ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతదేశం తరఫున ప్రదర్శించబడుతుండటం గర్వకారణం. శ్రుతి హాసన్ నటన, ఆసక్తికరమైన కథ, విజువల్ ట్రీట్ – ఇవన్నీ ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెట్టబోతున్నాయి!