Mon. Apr 15th, 2024
SKIN CARE DURING PANDEMIC CRISIS

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ , 4జులై 2020 : 2020 వ సంవత్సరాన్ని కోవిడ్ మహమ్మారి కాలంగా భవిష్యత్తు తరాలు గుర్తుంచుకొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈమహమ్మారి కారణంగా మన ఆరోగ్య పరిరక్షణలో పరిశుభ్రత, స్వఛ్చత లాంటివి ఎంత అవసరమో మనకు స్పష్టమైనాయి. ఇతర శరీరభాగాలతో పాటూ మన చర్మం ,జుట్టు యొక్క ఆరోగ్యాన్ని.పరిరక్షించుకోవడం కూడా ఎంతో అవసరం.ఏదైనా ఇన్ఫెక్షన్ రాకుండా మన శరీరానికి మొదటగా రక్షణ కలిపించేది చర్మం అని అయితే ఈ చర్మ సంరక్షణను మనం అంతగాప్రాధాన్యత లేని అంశంగా పరిగణిస్తామని డా. అలేఖ్య సింగపూర్, కన్సల్టెంట్ డెర్మటాలజిస్టు, కాస్మొటాలజిస్టు, ట్రైకాలజిస్టు అపోలో క్లినిక్స్, అపోలో క్రెడిల్ , హైదరాబాదు అన్నారు .ఇలా నిర్లక్ష్యం చేయడం వలన మనకు ఇన్ఫెక్షన్ రాకుండాఅడ్డుకోవడంలో మొట్ట మొదటి వరుసలో ఉండే చర్మ ఆరోగ్యం పాడైతే ఇన్ఫెక్షన్ త్వరగా సోకి మన ఆరోగ్యానికే ప్రమాదం ఏర్పడే అవకాశముందని ఆమె అభిప్రాయపడ్డారు. అంతే గాకుండా నానాటికీ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో బయట వాతావరణంలో
ఉండే పరిస్థితుల కారణంగా విపరీతమైన ఒత్తిడి కి మనిషి లోనైనందువలన కూడా చర్మం యొక్క స్వయంసిద్ద ఇన్ఫెక్షన్ నియంత్రణ లోపం ఏర్పడి ఇబ్బందులకు కారణం కావచ్చని ఆమె అన్నారు.
కారణం ఏదైనా చర్మ ఆరోగ్యానికి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి చిన్న చిన్నజాగ్రత్తలు తీసుకొంటే చాలని వైద్య నిపుణు సూచిస్తున్నారు.చేతులు తరచూ శుభ్ర పరచుకోవడం,సానిటైజర్స్/మాయిశ్చరైజర్స్
ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా సూచనలు మేరకు తరచూ చేతులను శుభ్రపరచుకోవడం,ఆల్కాహాల్ ఆధారిత సానిటైజర్స్, మాయిస్చ్రైజర్స్ ను వినియోగిస్తూ కోవిడ్,ఇన్ఫెక్షన్ నుండి రక్షించుకొనే ప్రయత్నం చేస్తున్నాం.కానీ ఈ రెండు పద్దతులలో సానిటైజర్స్ ఉపయోగించడం కన్నా తరచు సబ్బుతో చేతులు
కడుగుకోవడం మంచిదని డా. అలేఖ్య సింగపూర్, కన్సల్టెంట్ డెర్మటాలజిస్టు,కాస్మొటాలజిస్టు, ట్రైకాలజిస్టు, అపోలో క్లినిక్స్,అపోలో క్రెడిల్,హైదరాబాదు అన్నారు. అందుకే పేషెంట్లను సానిటైజర్స్ ఉపయోగించడం కన్నా తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం చేయాలని సూచిస్తున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఈ రెండు పద్దతులలో ఏది ఉపయోగించినప్పటికీ అది కోవిడ్ ఇన్ఫెక్షన్ నుండి మన శరీరాన్ని దూరం ఉంచగలుగుతాయి గాని మన చర్మంపై ఉన్న మాయిశ్చర్ ను పూర్తిగా తొలగించి వేస్తాయమని ఆమె వివరించారు. అందుకే ఈ రెండు పద్దతులను తరచూ ఉపయోగించే వారు ఖచ్చితంగా రోజూ కు రెండు సార్లు
మాయిశ్చరైజర్స్ ను కూడా రాసుకుంటే చర్మం పొడిబారడాన్ని అరికట్టవచ్చని ఆమె సూచించారు.
ఇలా మాయిశ్చరైజర్స్ ను ఉపయోగించేటపుడు అందులో సెరామైడ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న
మాయిశ్చరైజర్స్ ను ఎంపిక చేసుకోవాలని అందులోనూ ద్రవ గాఢత ఎక్కువగా ఉన్న వాటిని వినియోగించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలానే వాసన, కృత్రిమ ఫ్లేవర్స్ ను కలిగిన మాయిశ్చరైజర్స్ ను వినియోగించవద్దని వారు పేర్కొంటున్నారు. ఇక ఈ మాయిశ్చరైజర్స్ ను వినియోగించే సందర్భంలోనూ దానిని స్మానం చేసిన వెంటనే రాస్తే ఎక్కువ సమయం ఫలితం ఇస్తుందని వారు చెబుతున్నారు.విటమిన్ డి యొక్క ప్రభావం

SKIN CARE DURING PANDEMIC CRISIS
SKIN CARE DURING PANDEMIC CRISIS

మన శరీర అవయవాల సౌష్టవానికి విటమిన్ డి ఎంతో అవసరం. ఇది సాధారణంగా మనకు సూర్యకాంతి
నుండి స్వతహాగా లభిస్తుంది.అయితే ప్రస్థుత లాక్ డౌన్ పరిస్థితులలో బయటకు అడుగుపెట్టడం పూర్తిగా తగ్గిన
నేపధ్యంలో మన శరీరంలో విటమిన్ డి యొక్క స్థాయి పడిపోయి మన చర్మం,జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చని డా. అలేఖ్య సింగపూర్, కన్సల్టెంట్ డెర్మటాలజిస్టు,కాస్మొటాలజిస్టు , ట్రైకాలజిస్టు, అపోలో క్లినిక్స్ మరియు అపోలో క్రెడిల్,హైదరాబాదు హెచ్చరిస్తున్నారు. ఇలా విటమిన్ డి లోపం ఏర్పడడం వలన మన ఎముకలు, కిడ్నీ వంటి వాటిపైనే కాకుండా హార్మోన్లపై కూడా ప్రభావం చూపిస్తాయని ఆమె వివరించారు. దీని వలన మనిషిలో మానసిక సంతులన కోల్పోవడం జరుగుతుందని అందుకే విటమిన్ డి తగ్గిపోకుండా చూసుకోవాలని ఆమె సూచించారు. ముఖ్యంగా వయస్సు మీరిన వారికి దీని అవసరం ఎక్కువగా ఉంటుందని అంటూ చర్మం సంరక్షణ లో కూడా కీలక పాత్ర పోషించే విటమిన్ డి అవసరమైన శరీరానికి అందేలా చూసుకోవాలని ఆమె చెప్పారు.
ఒత్తిడి పరిస్థితులలో చర్మ ,జుట్టును సంరక్షించుకోవడం ,సాధారణంగానే నగర జీవనంలో ఒత్తిడి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడికి ఇపుడు మరింత
ఊతమిచ్చేలా కోవిడ్ పరిస్థితులు దోహదపడుతున్నాయి. ఇలా పెరిగిపోతున్న ఒత్తిడి కారణంగా కొన్ని రకములైన చర్మ,జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం లేక పోలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చర్మంపై ఉన్న వ్యాధి నిరోధకత తగ్గి సోరాసిస్,ఆక్నే, రొసాకియా,ఎక్జెమోటోస్ డెర్మటిటిస్ (psoriasis, acne, rosacea, and eczematous dermatitis) వంటివి ఏర్పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటి లక్షణాలు ఏవైనా తలెత్తితే వెంటనే నిపుణులైన డెర్మటాలజీ వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప స్వీయ పరిరక్షణ చర్యలు తగవని వారు సూచిస్తున్నారు.దీంతో పాటూ ఒత్తిడి కారణంగా శరీర చర్మం,జుట్టు కొంత మేర ఎక్కువ జిడ్డుగా మారడం
కూడా జరిగే అవకాశముందని వారంటున్నారు. అంతే కాకుండా ఇన్ఫెక్షన్ తో శరీరం పోరాడుతున్న, సమయంలో మన శరీరంలో ఉండే పోషకాలన్నీ ఈ పోరాటంలో పాల్గొనే ప్రధాన అవకాశాలకు మళ్లి పోతాయని తద్వారా జుట్టుకు అవసరమైన పోషకాలు అందకుండా పోయి జుట్టు రాలడం,తెగిపోవడం వంటివి కూడా జరుగవచ్చని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
ఈ నేపధ్యంలో చర్మ,జుట్టు సంరక్షణకై రోజూ వాటి పరిరక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డా. అలేఖ్య సింగపూర్,కన్సల్టెంట్ డెర్మటాలజిస్టు, కాస్మొటాలజిస్టు,ట్రైకాలజిస్టు, అపోలో క్లినిక్స్,అపోలో క్రెడిల్, హైదరాబాదు అన్నారు.ఇందుకోసం మైల్డ్ సబ్బు ,షాంపూలను ఉపయోగించి స్నానం చేయడం, స్నానం చేసిన పిమ్మట మాయిశ్చరైజర్,వ్రాసుకోవడం తో పాటూ SPF30స్థాయి ఉండే సన్ క్రీంలను ఉపయోగించుకోవడం చేయాలని ఆమె సూచించారు.అలానే విటమిన్ సి 3,ఫాటీ యాసిడ్స్ తో కూడిన సప్లిమెంట్స్ ను తీసుకోవడం ద్వారా చర్మం పొరిబాడకుండా, ఆరోగ్యకరంగా జుట్టునుఉంచుకోవచ్చని ఆమె తెలిపారు.
కోవిడ్ మహమ్మారి ఉన్న నేపధ్యంలో మంచి ఆరోగ్యకరమైన చర్మం,జట్టు ఉండడం ఎంతో అవసరం. అయితే తరచూ చేతులు కడుక్కోవడం, ఇంట్లోనే ఎక్కువగా ఉండడం, ఒత్తిడి కారణంగా చర్మ, జుట్టు సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటితో భాద పడే కుటుంభ సభ్యులెవరైనా ఉంటే వారికి అవసరమైన రీతిలో వైద్యుల సలహా సూచనల మేరకు సరైన చికిత్స, అవసరమైన ఆహారం అందించాలని వారు సూచిస్తున్నారు.