365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఖమ్మం, జనవరి 2, 2026: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం లోని మీనవోలు గ్రామంలో గత మూడు నెలలుగా పలు వీధి కుక్కలకు వింత చర్మ వ్యాధి సోకి చర్మంపై బొబ్బలు వచ్చి ఆ వ్యాధి తీవ్రతకు క్షీణించి మృతి చెందుతున్నాయి.

Read this also:Indian Real Estate Resurgence: PE Investments Surge 59% to $6.7 Billion in 2025..

ఇదీ చదవండి :పంచాయితీలను దత్తత తీసుకుని ‘అక్షర’ యజ్ఞం.. బీహార్‌లో సరికొత్త ప్రయోగం..!

అయితే ఆ కుక్కలు వ్యాధి సోకిన తర్వాత గ్రామం సమీపంలోని కాలవల్లో, వాగుల్లో, మురికిగుంటల్లోకి దిగి నీళ్లు తాగటం, నీళ్లల్లో దొర్లటం వల్ల అవే నీళ్లు పశువులు తాగటం, మునగడం, కొందరు మనుషులు బహిర్భూమికి వెళ్లి అదే వాటర్ వాడడం వల్ల పశువులకు, మనుషులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ వ్యాధి సోకిన కుక్కలు జిల్లాలో పలు గ్రామాలలో సంచరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వీధి కుక్కలు మట్టిలో దొర్లటం మురికి కాలువల్లో, వాగుల్లో దిగి నీళ్లు తాగటం ఈత కొట్టడం

వల్ల మట్టిలో దొర్లే చిన్నపిల్లలకు అలాగే వాగుల్లో చేపల వేటకు వెళ్లి మనుషులకి గాని ఆ నీళ్లలో ఉన్న చేపలకు గాని ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని నీళ్లు తాగిన పశువులకి ఈ వ్యాధి ఇలాగే కోనసోగితే తీవ్రస్థాయిలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవిస్తుందని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా పెంపు..

ఇదీ చదవండి :2025లో భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ఆరోగ్య సందేహాలివే..!

Read this also:L&T Secures Major EPC Orders from SAIL to Fuel India’s Steel Expansion..

అయితే ఈ వ్యాధి కేజెస్ వ్యాధిగా ఉందని పలువురు అనుమానంవ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ సిబ్బంది. వైద్య అధికారులు స్పందించి ఈ వ్యాధి సోకిన వీధి కుక్కలను తీసివేసి, ఉన్న కుక్కలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

ఏ వ్యాధి అయినా ప్రాథమిక దశలో నివారణ చేస్తే తప్ప వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత ఎన్ని నివారణ చర్యలు తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.