Mon. May 20th, 2024
srikrishnajewellery_10th_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 21,2023:ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌లలో ఒకటైన శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌ తమ బంజారాహిల్స్‌ స్టోర్‌10 యానివర్సరీ సెలెబ్రేషన్స్ లో భాగంగా వెడ్డింగ్‌ కార్నివాల్‌ ను ప్రారంభించింది. ఈ సంబరాలను 10రోజుల పాటునిర్వహించనుంది శ్రీకృష్ణ జ్యువెలర్స్‌ సంస్థ. ఫేమస్ సోషల్‌ క్యూరేటర్ల నేతృత్వంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో అద్భుతమైన బ్రైడల్‌ జ్యువెలరీ కలెక్షన్ ను ప్రదర్శించనున్నారు.

ఈ 10 రోజుల సంబరాలలో భాగంగా ప్రతి రోజూ విభిన్నమైన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇక్కడి అనుభవాలు వధువుల కలలను సాకారం చేస్తాయి. వెడ్డింగ్‌ ఈవెంట్‌ ప్రొఫెషనల్స్‌తో వినియోగదారులు ముచ్చటించడంతో పాటుగా వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ మేకర్స్‌, వస్త్ర డిజైనర్లు దగ్గర నుంచి హెయిర్‌, మేకప్‌ కళాకారులు, ఎక్సోటిక్‌ ఎఫ్‌ అండ్‌ బీ, డెకార్‌, వెడ్డింగ్‌ ఫోటోగ్రాఫర్లతో మాట్లాడవచ్చు. దీనితో పాటుగా విస్తృత శ్రేణిలో, తాజా బ్రైడల్‌ జ్యువెలరీని వజ్రాలు,కుందన్‌, పోల్కి ,యాంటిక్‌ గోల్డ్‌లో అందిస్తుంది.

srikrishnajewellery_10th_365

ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా బ్రైడల్‌ ఫ్యాషన్‌ వాక్స్‌ ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా బ్రైడల్‌మేకప్‌, త్వరలో వధువుగా మారబోయే వారికి ఫోటోగ్రఫీ వంటివి స్టోర్‌లో ఉంటాయి. అంతేకాదు, సెలబ్రిటీతో ఫోటో దిగే అవకాశం కూడా వినియోగదారులకు లభిస్తుంది.

హైదరాబాద్‌లోని స్టోర్‌లో ఇది వినూత్నమైన వేడుకగా నిలుస్తుంది. స్టోర్‌ను సందర్శించిన వినియోగదారులు మరింతగా పొందవచ్చు. వేరెవ్వరూ ఆస్వాదించని రీతిలో వెడ్డింగ్‌ కార్నివాల్‌ను సైతం ఆస్వాదించవచ్చు.

Sri-Krishna-Jewellers_365Telugu
Sri-Krishna-Jewellers_365Telugu

ఈ వినూత్నమైన వేడుకలకు భాగస్వాములు, సహకరించిన వారిలో ఈవెంట్‌ క్యూరేటర్స్‌,పర్పుల్‌ మార్టిని, పింక్‌ పియోనీ అండ్‌ కో , శిరీష మూలపరు, వెడ్డింగ్‌ పార్టనర్స్‌ : రచనోత్సవ్‌ ; వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ : ఇజ్హార్‌ ; ఫోటోగ్రఫీ : కిశోర్‌ కృష్ణమూర్తి అండ్‌ స్టూడియో ఏ ; డిజైనర్‌ వరుణ్‌ చక్కిళం ; హెయిర్‌ అండ్‌ మేకప్‌ : శాండి ఆర్టిస్ట్రీ, ఆహార భాగస్వామి: ఫ్యూజన్ 9 మరెంతో మంది ఉన్నారు.