Thu. Nov 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 19,2023: నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ప్రాంగణంలో 5&7 జోన్‌ల కోసం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ- ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ (బాలురు) (ఓపెన్)-2023ని నిర్వహించింది. ఈ మ్యాచ్‌లు 2023, అక్టోబర్ 16 నుంచి 18 వరకు జరిగాయి.

ఈ టోర్నమెంట్‌లో దక్షిణ, మధ్య భారతదేశం నుంచి మొత్తం 14 పాఠశాలలు పాల్గొన్నాయి. ఇది టోర్నమెంట్ లీగ్-కమ్-నాకౌట్ ప్రాతిపదికన నిర్వహించారు. అలాగే బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI) మ్యాచ్ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లు జరిగాయి.

టోర్నీ ప్రారంభోత్సవం అక్టోబర్ 16వ తేదీ ఉదయం 9.30 గంటలకు సువిశాల పాఠశాల మైదానంలో జరిగింది. ప్రారంభోత్సం రోజే ఆడే జట్లన్నీ సమావేశమయ్యాయి.

ముఖ్య అతిథులుగా బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, జనరల్ సెక్రటరీ నార్మన్ స్వరూప్ ఇసాక్ , సీనియర్ నేషనల్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌ షిప్‌లో తెలంగాణ రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ మొదటి ప్రధాన కోచ్ డాక్టర్ యూజీన్ జార్జ్ పాల్గొన్నారు.

అతిథులు, పాఠశాల సీనియర్ మేనేజ్‌మెంట్ కమిటీ వారు జ్యోతి ప్రజ్వలన చేసి స్ఫూర్తిదాయక పదాలతో ప్రారంభోత్సవం చేశారు. క్రీడా రంగానికి వారు చేసిన కృషికి మరియు పాఠశాలకు సమయం కేటాయించి నందుకు అతిథులను సత్కరించారు.

2023, అక్టోబరు 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్‌ల తర్వాత వలిడిక్షన్ వేడుక బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు విశాల్ , జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు శ్రీనాథ్ ఈ వాలిడిక్షన్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ రెండు ముఖ్యమైన కార్యక్రమాలకూ సీనియర్ మేనేజ్‌మెంట్ సభ్యులైన చైర్మన్ మల్కాకొమరయ్య, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మల్కా యశస్వి హాజరయ్యారు.

అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీనియర్ ప్రిన్సిపాల్ శ్రీమతి సునీతారావు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి గౌరి వచ్చిన అతిథులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే మరో వైస్ ప్రిన్సిపాల్ అంకిత నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న అన్ని పాఠశాలలు ఆహ్లాదకరమైన జ్ఞాపకాలను అందరికీ పంచాయి.

ఈ మూడు రోజుటూ బాస్కెట్ బాల్ టోర్నమెంట్లో పాల్గొన్న అన్ని జట్లు చాలా ఉత్సాహభరితంగా ఆడాయి. ఆ ఆటలన్నీ తమలోని క్రీడాస్ఫూర్తికి సాక్ష్యంగా నిలిచాయి. ఆటగాళ్ళు సంకల్ప బలం , శక్తివంతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

ఈ కార్యక్రమాన్నిహోస్ట్ చేసిన నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్అత్యాధునిక మౌలిక సదుపాయాలకు ప్రసిద్ధి చెందింది. పచ్చని క్యాంపస్, అత్యాధునిక భద్రత క్రీడాకారులకు మరింత సౌకర్యవంతంగా మారాయి.

డీపీఎస్ బెంగళూరు సౌత్ ఈ డీపీఎస్ సొసైటీ ఇంటర్ డీపీఎస్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి ట్రోఫీని గెలుచుకుంది. మొదటి రన్నర్స్ అప్ ట్రోఫీని డీపీఎస్ బెంగళూరు నార్త్ రెండో రన్నర్స్ అప్ ట్రోఫీని డీపీఎస్ బెంగళూరు ఈస్ట్ గెలుచుకున్నాయి. మొత్తంమీద ఈ మూడు రోజుల టోర్నమెంట్ చాలా విజయవంతంగా జరిగింది.

error: Content is protected !!