Sun. May 19th, 2024
T-Hub_Flash-Mob365

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 24,2023: దేనా ఔర్ లెనా సంక్షిప్త రూపం DENAURLEN, T-హబ్‌లోని స్టార్టప్ సంస్థ గేమిఫైడ్ సోషల్ మీడియా DENAURLEN గురువారం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

మాదాపూర్ వద్ద T-హబ్ 2ndఫేజ్ ముందు. 3C(క్రియేట్, కొలాబరేట్ అండ్ కాంకర్) ఫెస్టివల్‌లో భాగంగా ఈ ప్రదర్శన నిర్వహించారు.

ఇందులో భాగంగా అనురాగ్ యూనివర్శిటీకి చెందిన 60 మంది విద్యార్థులు ఒకే రంగు టీ-షర్టులు ధరించి రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ ఫ్లాష్ మాబ్ చేశారు. అనంతరం పది గుర్రాలపై ఊరేగింపు నిర్వహించారు. దాదాపు 3వేల మంది ప్రేక్షకులను ఆహ్లాదపరిచేలా గుర్రాలు రోడ్డుపై పరుగులు తీశాయి.

సుమారు 15 స్పోర్ట్స్ బైక్‌లతో ర్యాలీ చేశారు. క్లబ్ GT Hyd సభ్యుల నుంచి పదిహేనుపైగా ప్రీమియం లగ్జరీ కార్లతో ర్యాలీ నిర్వహించారు.

వీటిలో కొన్ని Mercedes-Benz, BMW, Volvo, Audi, Porsche, Lexus, Lamborghini, Ferrari, Land Rover బ్రాండ్స్ ఉన్నాయి. వీటి ధర రూ. 1 కోటి కంటే ఎక్కువ. క్లబ్ GT హైదరాబాద్ ఈ కార్లను ప్రదర్శించిన హైదరాబాద్‌లోని మొదటి సూపర్ కార్ క్లబ్ ఓనర్స్ గ్రూప్.

T-Hub_Flash-Mob365

యువత పెద్ద కలలు కనాలని, అభిరుచిని వ్యాపారంగా మార్చుకోవాలని, వాటిపై అవగాహన కల్పించేందుకు 3సి ఫెస్టివల్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

యువతను ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారిగా కాకుండా, ఉద్యోగాలు అందించేలా ఉండమని చెప్పేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో డెనౌర్లెన్ వ్యవస్థాపకుడు సీఈఓ ఠాగూర్, డెనౌర్లెన్ సీఓఓ శ్రీమతి సౌమ్య రావుల పాల్గొన్నారు.

Denaurlen అనేది దేనా ఔర్ లీనా సంక్షిప్త రూపం, T-హబ్‌లో ఇంక్యుబేట్ అవుతున్న మొదటి రకమైన గేమిఫైడ్ సోషల్ మీడియా కంపెనీ.