Sun. Oct 6th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై,జూన్ 4,2024: భారతదేశంలో దిగ్గజ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ (టాటా ఏఐఏ)  మిడ్‌క్యాప్ మూమెంటం ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. భారతదేశ మిడ్‌క్యాప్ రంగ వృద్ధి అవకాశాల ద్వారా ప్రయోజనాలను అందిపుచ్చుకునే విధంగా ఇది తీర్చిదిద్దబడింది.

రాబోయే కొన్ని దశాబ్దాల పాటు దేశ ఎకానమీ అనేక రెట్లు వృద్ధి చెందగలదన్న అంచనాల నేపథ్యంలో సంపద సృష్టికి భారత ఈక్విటీ మార్కెట్ అపార అవకాశాలు కల్పించగలదు.

పెరుగుతున్న వినియోగం, ఆదాయాలు, సంఘటిత రంగాల వైపు మళ్లుతుండటం ,అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు మెరుగ్గా అనుసంధానమవుతుండటం, సానుకూల ప్రభుత్వ విధానాలు మొదలైన అంశాలన్నీ మిడ్‌క్యాప్ కంపెనీలు వృద్ధి చెందడానికి అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నాయి.

ఈ న్యూ ఫండ్ ఆఫరింగ్ (ఎన్ఎఫ్‌వో) జూన్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. యూనిట్ NAV రూ. 10గా ఉంటుంది.

నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 మూమెంటం 50 సూచీని ప్రతిబింబించేదిగా మిడ్‌క్యాప్ మూమెంటం ఇండెక్స్ ఫండ్‌ ఉంటుంది. నార్మలైజ్డ్ మూమెంటం స్కోర్ ఆధారంగా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 నుంచి ఎంపిక చేసిన, అధిక వృద్ధికి ఆస్కారమున్న 50 కంపెనీల పనితీరుకు అనుగుణంగా ఈ సూచీ ఉంటుంది. తద్వారా హై-గ్రోత్ మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడుల ప్రయోజనాలను ఇన్వెస్టర్లకు అందించడం లక్ష్యంగా పనిచేస్తుంది.

మిడ్‌క్యాప్ మూమెంటం ఇండెక్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు గల ప్రధాన కారణాలేమిటంటే:

.ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యం: వైవిధ్యమైన మిడ్‌క్యాప్ కంపెనీల పోర్ట్‌ఫోలియో ద్వారా దీర్ఘకాలికంగా పెట్టుబడి వృద్ధికి ఆస్కారం

.ఫండ్ మేళవింపు: ఈక్విటీ ,ఈక్విటీ-సంబంధ సాధనాల్లో 80%-100%, క్యాష్ ,మనీ మార్కెట్ సెక్యూరిటీల్లో 0%-20% పెట్టుబడులు

“భారతదేశ మిడ్‌క్యాప్ రంగ పటిష్ట వృద్ధిని సూచిస్తూ గత 9 ఏళ్లుగా మిడ్‌క్యాప్ మూమెంటం సూచీ 11 రెట్లు పెరిగింది. భారత వృద్ధి గాధ దన్నుతో ముందుకెడుతున్న ఈ రంగం ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశాలను మా ఇన్వెస్టర్లకు అందించాలనే లక్ష్యంతో మిడ్‌క్యాప్ మూమెంటం ఇండెక్స్ ఫండ్‌ను రూపొందించాం.

తయారీ,సేవల రంగం భారీ వృద్ధి, వినియోగ డిమాండ్ పెరుగుతుండటం, పొదుపు మొత్తాలను ఆర్థిక సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే ధోరణి పెరుగుతుండటం తదితర అంశాలతో దేశం అమృత ఘడియల్లో ముందుకెడుతోంది.

మేము అందించే పెట్టుబడి ఆధారిత ప్లాన్లతో మా వినియోగదారులు ఆర్థిక భద్రత,ఆరోగ్యం & వెల్‌నెస్ ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక రాబడులను కూడా అందుకోవచ్చు” అని టాటా ఏఐఏ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (సీఐవో) హర్షద్ పాటిల్ తెలిపారు.

ఫార్చూన్ ప్రో, వెల్త్ ప్రో, ఫార్చూన్ మ్యాక్సిమా సహా కంపెనీ అందించే యులిప్ ప్లాన్ల ద్వారా టాటా ఏఐఏ పాలసీదారులు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. హెల్త్, వెల్‌నెస్, లైఫ్ కవరేజీ వంటి పలు ప్రయోజనాలు అందించే పరమ్ రక్షక్ ప్లస్, ప్రొ-ఫిట్‌లాంటి వినూత్న ILP సాధనాల ద్వారా కూడా ఈ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు.

ఒకవైపు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీతో తమ ప్రియమైన కుటుంబసభ్యులకు ఆర్థిక భద్రత కల్పిస్తూనే మరోవైపు ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను అందుకోవడానికి ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ ఉపయోగపడగలదు.

 “టాటా ఏఐఏలో మేము నిరంతరం, మా వినియోగదారుల వైవిధ్యమైన ఆర్థిక అవసరాలకు అనుగుణమైన సొల్యూషన్స్‌ను రూపొందించేందుకు కృషి చేస్తుంటాం.

ఇటు జీవిత బీమా, ఆరోగ్య కవరేజీపరమైన భద్రత అటు  వృద్ధి అవకాశాల మధ్య సమతౌల్యతను పాటించేందుకు మా పరమ్ రక్షక్ సిరీస్,ప్రొ-ఫిట్ మేళవింపుతో కూడుకున్న మిడ్‌క్యాప్ మూమెంటం ఇండెక్స్ ఫండ్ ఉపయోగపడగలదు.

దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించే మా ఇన్వెస్టర్లకు ఈ కొత్త ఫండ్ తప్పక నచ్చుతుంది” అని టాటా ఏఐఏ ప్రెసిడెంట్ – సీఎఫ్‌వో & హెడ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ ప్రపోజిషన్స్ సమీత్ ఉపాధ్యాయ్ ధీమా వ్యక్తం చేశారు.

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తమ పాలసీదారులకు విశిష్టమైన, అసాధారణ ప్రయోజనాలను అందిస్తూ ముందుకెడుతోంది. మిడ్‌క్యాప్ 150 మూమెంటం 50 ఇండెక్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా తమ వినియోగదారుల ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పటిష్టమైన పెట్టుబడి అవకాశాలను కల్పించడంలో టాటా ఏఐఏ లైఫ్ తమకు గల నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది.

ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పాలసీదారులు సమగ్రమైన జీవిత బీమా కవరేజీతో లభించే భద్రత, నిశ్చింతను పొందడంతో పాటు భారతదేశ మిడ్‌క్యాప్ రంగ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోగలరు.

టాటా ఏఐఏ ఫండ్‌లు బెంచ్‌మార్క్‌ని మించిన ఫలితాలను సాధిస్తున్నాయి:

“గత అయిదేళ్ల రాబడులు” (CAGR)
టాటా ఏఐఏ ఫండ్స్ఫండ్ రాబడి (%) *బెంచ్‌మార్క్ రాబడి (%) *
మల్టీ క్యాప్ ఫండ్27.80%16.10%
టాప్ 200 ఫండ్27.14%16.10%
ఇండియా కన్జంప్షన్ ఫండ్26.92%16.10%

*2024 ఏప్రిల్ 30 నాటి డేటా. గత పనితీరనేది భవిష్యత్ పనితీరును సూచించజాలదు. ఫండ్ బెంచ్‌మార్క్: మల్టీ క్యాప్ ఫండ్, ఇండియా కన్జంప్షన్ ఫండ్, టాప్ 200 ఫండ్: S&P BSE 200

స్టాక్స్ ఎంపికలో బాటమ్-అప్ వ్యూహంతో అత్యుత్తమంగానిలకడగారిస్క్-అడ్జెస్టెడ్ దీర్ఘకాలిక రాబడులను  అందించే దిశగా పాలసీదారుల పట్ల గల నిబద్ధతను టాటా ఏఐఏ పెట్టుబడుల విధానం ప్రతిబింబిస్తుంది.

కంపెనీ పటిష్టమైన పరిశోధన ప్రక్రియలను అమలు చేస్తోంది. తమ వినియోగదారులకు నిరంతరం విలువను చేకూర్చేందుకు దీర్ఘకాలిక దృష్టికోణంతో పని చేస్తోంది.

సంస్థ నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) పరిమాణం 2024 ఏప్రిల్ నాటికి రూ. 1 లక్ష కోట్ల మార్కును అధిగమించింది. 2024 మార్చి 31 నాటికి 91 శాతం టాటా ఏఐఏ ఏయూఎంనకు మార్నింగ్‌స్టార్ రేటింగ్స్ నుంచి 5 ఏళ్ల ప్రాతిపదికన 4 స్టార్ లేదా 5 స్టార్స్ రేటింగ్ ఉండటం గమనార్హం.

Also read : Tata AIA Life Launches Midcap Momentum Index Fund as Indian Economy Poised for Multi-Fold Expansion

ఇది కూడా చదవండి: సరికొత్త ప్యాకేజీలను ప్రవేశ పెట్టిన ఎయిర్టెల్..

ఇది కూడా చదవండి: తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే పోటీ..

ఇది కూడా చదవండి:హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయనున్న క్యాష్ఈ

ఇది కూడా చదవండి :తెలంగాణ లోక్‌సభ ఓట్ల లెక్కింపు ప్రారంభం; మధ్యాహ్నం 3 గంటలలోపు ఫలితాలు

Also read :Mahindra Celebrates 25 Years of Bolero Pik-Ups: A Legacy of Reliability and Performance

Also read :Edelweiss Tokio Life Insurance is now Edelweiss Life Insurance

error: Content is protected !!