365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగుళూరు, జూలై 30, 2024:రుచికరమైన ,మెరుగైన మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులను అందించాలనే  నిబద్ధతతో ప్రఖ్యాతి గాంచిన టాటా సోల్‌ఫుల్, ఇప్పుడు  టాటా సోల్‌ఫుల్ మసాలా ఓట్స్+ దాల్ శక్తి ని ఆవిష్కరిస్తున్నట్లు  సగర్వంగా ప్రకటించింది. 

మసాలా ఓట్స్ విభాగంలో ఈ విప్లవాత్మక నూతన వేరియంట్ మూంగ్ దాల్( పెసర పప్పు)పోషణ వారి  ప్రముఖ మస్త్ మసాలా రుచితో మిళితం చేస్తుంది. ఇది పోషణ, రుచి,సౌలభ్యాన్ని మిళితం చేసే అసమానమైన చిరుతిండి అనుభవాన్ని అందిస్తుంది.

టాటా సోల్‌ఫుల్ 25% మిల్లెట్‌లతో తయారు చేసిన నాన్-స్టిక్కీ మసాలా ఓట్స్+తో స్నాకింగ్ స్పేస్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. తృణ ధాన్యాల మాదిరిగానే,  దాల్ అనేది ఒక పురాతన భారతీయ ధాన్యం, ఇది దేశ వ్యాప్తంగా  గృహాలలో ఎక్కువగా వినియోగించబడుతుంది. దాల్ మంచితనం భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయింది. 

ఇది భారతీయ వినియోగదారుకు అత్యుత్తమ  సౌకర్యవంతమైన ఆహారంగా నిలుస్తుంది. వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల దాల్‌లను వినియోగిస్తారు. ఖిచ్డీ,దాల్ తడ్కా రూపంలో విరివిగా తీసుకునే మూంగ్ దాల్ చాలా రుచికరమైనదిగా పరిగణించబడుతుంది. 

టాటా సోల్‌ఫుల్ మసాలా ఓట్స్+ దాల్ శక్తి కొత్త ఆవిష్కరణ  మూంగ్ దాల్ రుచి మరియు పోషణని  కోర్ రేంజ్ నాన్-స్టిక్కీ ప్రతిపాదనతో మిళితం చేస్తుంది. మూంగ్ దాల్ చేర్చడం, 4 నిమిషాల తయారీ సమయం సౌలభ్యంతో బలమైన దాల్ ప్రోటీన్ ప్రతిపాదనను అందిస్తుంది.

తద్వారా ఇది ఆరోగ్యకరమైన సాయంత్రం స్నాక్‌గా మారుతుంది. వినియోగదా రులకు సరసమైన ధర వద్ద పోషకాహారం, రుచిని నిర్ధారిస్తూ, ఈ కొత్త ఉత్పత్తి ఆఫర్ రూ. 15/- ప్రారంభ ధరతో వస్తుంది.

“టాటా సోల్‌ఫుల్‌ని మసాలా ఓట్స్‌ విభాగంలోకి ప్రవేశించటం ద్వారా కేటగిరీలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.గణనీయమైన వృద్ధి అవకాశాలు సైతం తెస్తుంది.  

సోల్‌ఫుల్ ఆవిష్కరణ కు ముందు, ఈ విభాగం  13% వద్ద వృద్ధి చెందింది.మేము ప్రవేశించినప్పటి నుండి, మేము కేటగిరీ వృద్ధిని 25%కి పెంచాము” అని టాటా కన్స్యూమర్ సోల్‌ఫుల్ ఎండి & సీఈఓ శ్రీ ప్రశాంత్ పరమేశ్వరన్  చెప్పారు. 

“ఈ విజయవంతమైన ప్రయోగం ఓట్స్‌ ,పోషణ తో ‘నాన్-స్టిక్కీ’ ప్రతిపాదనను అందించడం ద్వారా వినియోగదారుల ఇబ్బందిని పరిష్కరించింది.  ముఖ్యంగా వినియోగదారులకు భారతీయ రుచులపై ఉన్న మక్కువను దృష్టిలో పెట్టుకొని మూంగ్ ధాల్ పోషణతో కూడిన మసాలా ఓట్స్ ను తయారు చేసాము. 

ఇది ఈ విభాగంలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని,టాటా సోల్‌ఫుల్ మసాలా ఓట్స్ + దాల్ శక్తిని దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో ప్రధానమైనదిగా మారుస్తుందని మేము నమ్ముతున్నాము…” అని అన్నారు. 

టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ గ్లోబల్ హెడ్- ఆర్ & డి  వికాస్ గుప్తా మాట్లాడుతూ- “ఓట్స్‌లోని పోషక ప్రయోజనాలను దాల్ ప్రోటీన్,పోషణతో సంపూర్ణంగా   మసాలా ఓట్స్ + దాల్ శక్తి  మిళితం చేస్తుంది. ఇది భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రత్యేకమైన మసాలాతో టాపింగ్ చేయబడి ఉంది. ఈ ఉత్పత్తి మా వినియోగదారులకు సంతోషకరమైన,ఉన్నతమైన స్నాక్స్ అనుభవాన్ని అందించడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది…” అని అన్నారు. 

టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ పప్పు ధాన్యాల విభాగంలో లోతైన నైపుణ్యాన్ని పొంది, దాని ప్రఖ్యాత టాటా సంపన్ శ్రేణి ఆధారంగా టాటా సోల్‌ఫుల్ మసాలా ఓట్స్+ ఇప్పుడు దాల్  ప్రోటీన్,పోషణతో కూడిన ఆరోగ్యకరమైన స్నాకింగ్ ఎంపికగా మారింది.

టాటా సోల్‌ఫుల్ మసాలా ఓట్స్+ దాల్ శక్తి రెండు ఎస్ కె యు లలో లభిస్తుంది: 31గ్రా ప్యాక్ ప్రారంభ ధర రూ. 15/- 500గ్రా ప్యాక్ ధర రూ. 249/-. ఇప్పుడు ఈ సరసమైన ధరలలో  పోషణతో కూడిన   రుచికరమైన చిరుతిండిని వినియోగదారులు ఆస్వాదించవచ్చు.

Also read: Tata Soulfull launches Masala Oats+ Dal Shakti, a Mazze-Dal delight for your evening bite

Also read: L&T wins multiple orders (Large*) to build grid elements forming backbone  of clean energy transition.

Also read: ISB Executive Education and Emeritus Launch ‘Cybersecurity for Leaders Programme’ Equipping Leaders with Expertise to Combat Cyber Threats

Also read: Xiaomi India Raises the Bar with Redmi Pad Pro and Redmi Pad SE 4G: A New Era of Entertainment & Productivity Tablets

Also read: Daimler India Commercial Vehicles Partners with Bajaj Finance to Offer Comprehensive Financing Solutions

ఇదికూడా చదవండి: వండర్లాలో ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా స్పెషల్ ఆఫర్స్..

Also read: Celebrate Friendship Day with Thrilling Buy 1 Get 1 Free Offer at Wonderla!

Also read: Filatex Fashions Ltd’s mining subsidiary receive Export Order worth USD 35 million (Rs. 293 crore)

ఇదికూడా చదవండి: 10వ తరగతి ఉత్తీర్ణతతో యానిమల్ హస్బెండరీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 2,250 పోస్టులు.