Tue. May 21st, 2024
Tata Tea’s latest Jaago Re initiative urges people to lend a helping hand to support staff in their COVID-19 vaccination journey

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, జూన్‌ 2021:టాటా టీ తమ తాజా ఎడిషన్‌ జాగోరే, ‘ఇస్‌ బార్‌ సబ్‌కే లియే జాగోరో’ ప్రచారాన్ని ఓ మహోన్నత కారణం పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రారంభించింది. ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో ఇది అత్యవసర అంశం. ఈ ప్రచారం ద్వారా తమ రోజువారీ జీవితంలో ఇతరులకు చేయూతనివ్వడానికి ముందుకు వచ్చే వారికి చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నారు.గత సంవత్సర ప్రచారం అయిన ‘ఇస్‌ బార్‌ బదోంకేలియే జాగోరే’కు కొనసాగింపుగా ‘ఇస్‌ బార్‌ సబ్‌ కేలియే జాగో రే’ ప్రచారం ఆరంభించారు. దీని ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుగా తమ కోవిడ్‌–19 టీకా ప్రయాణంలో అవసరమైన మద్దతు కావాల్సిన వారికి సహాయపడాల్సిందిగా ప్రజలను కోరుతుంది. ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తులు ముందుకు రావడంతో పాటుగా తమ టీకా కోసం నమోదు చేసుకోవడం తెలియని లేదా టీకా గురించి పరిమిత జ్ఞానం ఉన్న రోజువారీ కార్మికులైనటువంటి పనివారలు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు,గార్డెనర్లు లాంటి సరైన వనరులు పొందలేని వారికి సహాయపడాల్సిందిగా కోరుతుంది.

ప్రస్తుతం తమ టీకా ప్రయత్నాలలో పలు సవాళ్లను ప్రజలు ఎదుర్కొంటున్నారు. అవగాహన లేమి, కోవిడ్‌–19 సంబంధిత అపోహలు, డిజిటల్‌ గా విడిపోవడం. సాంకేతికత, భాష అవరోధాలు వంటివి వీటిలో ఉంటున్నాయి. ‘ఇస్‌బార్‌ సబ్‌కేలియే జాగోరే’ ప్రచారం ద్వారా అవగాహన కల్పిస్తూనే , మార్పుకు సైతం తోడ్పడటం ద్వారా ఈ సమస్యలలో కొన్నింటిని అయినా పరిష్కరించగలమని ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా

·అవగాహన విస్తరించడం,తమ మద్దతు సిబ్బందికి సహాయపడేలా ఇతరులకు స్ఫూర్తి కలిగించడం,తమ చుట్టూ ఉన్న ప్రజలు టీకా వేసుకునేందుకు డిజిటల్‌ ఔట్‌రీచ్‌ ద్వారా ప్రోత్సహించడం,సోషల్‌ మీడియాపై ఆధీకృత ప్రభావితదారులపై ఆధారపడటం

Tata Tea’s latest Jaago Re initiative urges people to lend a helping hand to support staff in their COVID-19 vaccination journey
Tata Tea’s latest Jaago Re initiative urges people to lend a helping hand to support staff in their COVID-19 vaccination journey

·సమాచారం అందించడం , దీనిలో భాగంగా పూర్తిగా అంకితం చేసిన మైక్రోసైట్‌ రూపొందించి టీకా సంబంధిత సమాచారం, వనరులు, మద్దతు సలహాలు అందించడం

·వలెంటీర్‌ బృందాలు, ఎన్‌జీఓలతో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం ద్వారా నిరుపేదలకు తమ టీకా ప్రయాణంలో తోడ్పాటునందించడం

గత కొద్ది సంవత్సరాలుగా, టాటా టీ జాగోరే కార్యక్రమం సామాజిక అవగాహన కోసం ఓ సమిష్టి పిలుపుగా మారింది. అత్యుత్తమ సమాజం కోసం అసలైన మార్పులను ప్రోత్సహించడం,సులభతరం చేయడం చేస్తున్నారు.

ఈ కార్యక్రమం గురించి పునీత్‌ దాస్‌,అధ్యక్షులు ప్యాకేజ్డ్‌ బేవరేజస్‌ (ఇండియా అండ్‌ దక్షిణాసియా) మాట్లాడుతూ ‘‘అవగాహన కల్పించడం,చర్యలు తీసుకునేలా ప్రజలకు స్ఫూర్తి కలిగించడం ద్వారా భారీ సామాజిక సమస్యలను పరిష్కరించడంలో అత్యంత కీలకంగా జాగోరే ఎల్లప్పుడూ నిలుస్తుంటుంది.ఈ సారి మేము మనకు ప్రతి రోజూ సహాయపడే ప్రజలను కాపాడాల్సిందిగా చెప్పడంపై దృష్టి కేంద్రీకరించాం. టీకా వేయించుకోవాల్సిన అవగాహన తెలుపడంతో పాటుగా, విద్య, సంబంధిత సలహాలు అందించడం, కమ్యూనిటీ భాగస్వాములతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా ప్రజలకు స్ఫూర్తి కలిగించడం, చివరగా ఇతరులు సైతం ఇదే తరహా ప్రతిజ్ఞ చేయడం వంటివి దీనిలో భాగంగా ఉన్నాయి. ఈ ప్రచారం ద్వారా టీకా కార్యక్రమంలో దేశానికి మా వంతు తోడ్పాటునందించడానికి లక్ష్యంగా చేసుకున్నాం.

Tata Tea’s latest Jaago Re initiative urges people to lend a helping hand to support staff in their COVID-19 vaccination journey
Tata Tea’s latest Jaago Re initiative urges people to lend a helping hand to support staff in their COVID-19 vaccination journey

ఎందుకంటే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండే వరకూ ఏ ఒక్కరూ సురక్షితం కాదని నమ్ముతున్నాం’’ అని అన్నారు.జాగోరో గత ఎడిషన్లు విజయవంతం కావడంతో, ‘ఇస్‌బార్‌ సబ్‌కేలియే జాగోరే’ ప్రచారం ద్వారా అందరికీ టీకా అనే లక్ష్యం సాకారం అయ్యేందుకు ప్రస్తుతం చేస్తోన్న ప్రయత్నాలకు తోడ్పాటునందించడానికి లక్ష్యంగా చేసుకుంది.