Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 22,2024 : తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం(టీ.ఎమ్.కే.ఈ.డబ్ల్యూ.ఏ)ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా సర్వ సభ్య సమావేశంలో క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన TMKEWA నిజామాబాదు జిల్లా కార్యవర్గానికి ప్రత్యేకంగా తోట రాజశేఖర్ పటేల్ ,డాక్టర్ అబ్బపూర్ రవి పటేల్, భాశెట్టి సురేష్ పటేల్, బుసా ఆంజనేయులు పటేల్, ఆకుల ప్రసాద్ పటేల్, జిలకర కిషన్ పటేల్ ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

దాదాపు 15 జిల్లాలకు పైగా సంబందించిన 350పైగా సభ్యులు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయడం జరిగింది. 2024 సంవత్సరం ఆరంభంను అద్భుతమైన రీతిలో ప్రారంభించిన నిజామాబాద్ కార్యవర్గానికి ప్రత్యేక అభినందనలు.

సమావేశం ఏర్పాట్లు, గడ్డం రచన పటేల్ కార్యక్రమ నిర్వహణ విధానం,భోజనం, ఆయా జిల్లాల బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు, అతిధుల ఆలోచనలతో సాగిన ఉపన్యాసాలు, రాష్ట్ర ఈసీ సమావేశం చర్చలు తీర్మానాలు వాటి ఆమోదం అన్ని చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. TMKEWA సంఘ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన కార్యక్రమాలను చర్చించి ఆమోదించుకోవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ఈసీ సమావేశం ద్వారా అనేక అంశాలు చర్చించి అందరికి ఆమోదయోగ్యమైన తీర్మానాల ద్వారా 2024 సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాల రూపకల్పన జరిగింది. వాటి వివరాలు త్వరలో అందిరి ముందు ఉంచడం జరుగుతుందని సంఘ నాయకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇలాంటి సమావేశాలు ఇతర ఉమ్మడి జిల్లాలలో కూడా నిర్వహించాలని తీర్మానించుకున్నాం. త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశ తేదీని తెలపడం జరుగుతుంది.

నిజామాబాద్ జిల్లా సమావేశానికి హాజరైన టీ.ఎమ్.కే.ఈ.డబ్ల్యూ.ఏ రాష్ట్ర బాధ్యులు, జిల్లాల బాధ్యులు, నిజామాబాద్ జిల్లా సభ్యులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపింది టీ.ఎమ్.కే.ఈ.డబ్ల్యూ.ఏ రాష్ట్ర కార్యవర్గం.