Sat. Dec 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 5, 2024: ఇంక్రెడిబుల్ ఇండియా స్టాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూకే లో భారత హై కమిషనర్ విక్రమ్ దురై స్వామి, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హాతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. యూకే లో భారత హై కమిషనర్ విక్రమ్ దురై, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హా స్టాల్ ను సందర్శించారు.

లండన్ టీ ఎక్స్చేంజ్ చైర్మన్ తో భేటీ అయిన మంత్రి జూపల్లి, తెలంగాణ పర్యాటక రంగంలో పెట్టుబడులపై, హైదరాబాద్ లో టీ ఎక్స్చేంజ్ ఔట్లెట్, లండన్ ఐ తరహాలో ఐకానిక్ జాయింట్ వీల్ ఏర్పాటు వంటి విషయాలపై చర్చించారు.

తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్ ని ప్రారంభించిన మంత్రి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డా. వంశీ కృష్ణ, డా. రాజేష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

లండన్ వేదికగా జరుగుతున్న 44 వ వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో తెలంగాణ పర్యాటకానికి ప్రాధాన్యం పెరుగుతోంది. “ఆవిర్బావిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం – పర్యాటక రంగానికి మేలు చేసే అవకాశాలు” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్ లో పర్యాటక సంస్థ అభివృద్ధి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి ఈ స్టాల్ ని ప్రారంభించారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు తెలంగాణ పర్యాటక అందాలు, చారిత్రక ప్రదేశాల ఫోటోలను డిజిటల్ స్క్రీన్లలో ప్రదర్శించారు.

యూకే లో భారత హై కమిషనర్ విక్రమ్ దురై, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హా, గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖంటే, ఒడిషా డిప్యూటీ సీఎం ప్రవతి ఫరీదా, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి తదితరులు తెలంగాణ పర్యాటక స్టాల్ ను సందర్శించారు.

తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా వివిధ దేశాల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్రాల పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రతిష్టాత్మక లండన్ టీ ఎక్స్చేంజ్ చైర్మన్ ఆల్యూర్ రెహమాన్ తో ప్రత్యేకంగా భేటీ అయిన మంత్రి, పర్యాటక శాఖ అభివృద్ధిలో విదేశీ పెట్టుబడులు, హైదరాబాద్ లో టీ ఎక్స్చేంజ్ ఔట్లెట్ ఏర్పాటు, లండన్ ఐ తరహాలోజాయింట్ వీల్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలను, తెలంగాణ పర్యాటక ప్రదేశాల గురించి వారికి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు, “సీయం రేవంత్ రెడ్డి పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో, ప్రపంచ పర్యాటక యవనికపై తెలంగాణ పర్యాటకం తనదైన ప్రత్యేకతను చాటుతోందని” అన్నారు. పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణతో ముందుకెళ్లుతున్నట్లు తెలిపారు.

తెలంగాణ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో తెలంగాణ పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తామని పేర్కొన్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్రాల మధ్య సమన్వయం ఎంతో అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో, యూకే లో భారత హై కమీషనర్ విక్రమ్ దురై, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హాతో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. లండన్ లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM) లో ప్రపంచవ్యాప్తంగా 125 దేశాలు, భారత్ నుండి 10 పైగా రాష్ట్రాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.

error: Content is protected !!