Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 26, 2023: బోయిన్ పల్లి లోని పల్లవి మోడల్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హరిహరకళా భవన్ వేదికగా ఈ కార్యక్రమం 2023, డిసెంబర్ 26వ తేదీన ప్రైమరీ, సెకండరీ బ్లాకుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సంవత్సరం ‘పరివర్తన్-ది విండ్స్ ఆఫ్ చేంజ్’ థీమ్ తో సరికొత్తగా ఈ వార్షికోత్సవాన్ని జరుపుతున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి హాజరై, యువత వాతావరణ పరిరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషించాలని, ముఖ్యంగా మన కార్బన్ ఫూట్ ప్రింట్స్ ను తగ్గించడానికి బాగా కృషి చేయాలని కోరారు. స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య ఈ వేడుకలో పాల్గొని ఈ ఉత్సవాలకు విశిష్టతను జోడించారు.

స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ టి.సుధ మాట్లాడుతూ.. పరిశోధనాత్మక, పరివర్తనాత్మక మార్పు ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అలాగే సీఈఓ మల్కా యశస్వి ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థులను ఉత్తేజపరిచారు.

‘సమీకరణ్’ పేరుతో 9వ తరగతి విద్యార్థులు లింగ సామనత్వం, పదునైన అన్వేషణను హైలైట్ చేశారు. సమాజంలో రావాల్సిన మార్పును అందరికీ గుర్తొచ్చేలా చేశారు. డిజిటల్ యుగాన్ని ఆలింగనం చేసుకుంటూ.. 10 & 3 తరగతుల విద్యార్థులు సాంకేతిక పరివర్తన శక్తిని ప్రదర్శించారు. తక్నికి పేరుతో కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్తును రూపొందించారు. గ్రేడ్-2 చిన్న పిల్లలు ‘పర్యావరణ్’ పేరుతో చక్కని ప్రదర్శన ఇచ్చారు.

గ్రేడ్- 4&8 తరగతుల విద్యార్థులు దృశ్యచిత్రం ద్వారా సంస్కృతి సమాజంపై దృశ్య మాధ్యమం ప్రభావాన్ని తెలిపే కథతో ముందుకొచ్చారు. స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి రేణు చక్రవర్తి అందరి ప్రయత్నాలను ప్రశంసించారు. పాఠశాల అనేది విద్యార్థులను ప్రకాశవంతం చేయడానికి, సృజనాత్మకతను సహకారాన్ని పెంపొందించడానికి ఉన్న ఒక వేదికని ఆమె తెలియజేశారు.