ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, డాక్టర్ నాగేశ్వరీ రావు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 2,2024: ఈనాటి కొంత మంది యువత పార్టీల వల్ల జీవితాలను అల్లకల్లోలం చేసుకుంటున్నారని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, శ్వేత మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వరీ రావు ఆవేదన వ్యక్తంచేశారు.
వనస్థలిపురంలో జరిగిన సంఘటన పై డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ హల్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. యువత చాలా శక్తివంతుల న్నారు . పార్టీ లంటే రేపు మరింత సంతోషంగా జీవించేలా ఉండాలన్నారు. తెల్లవారుజామున 3,4 గంటల వరకు పార్టీలు చేసుకోవడం గోప్ప అనుకుంటున్నారన్నారు.
విజయాలకు పబ్, ఫామ్ హౌస్, హోటల్ లో పార్టీ ఇస్తేనే గొప్ప అనుకునే స్థాయికి కొంత మంది యువత ఆలోచనలు వ్యూహాలు ఉంటున్నా యన్నారు. మొగవాడికి ఆడపిల్ల ఒంటరిగా ఉంటే కోరిక రావచ్చు…ఫ్రెండ్ అంటే ఒప్పుకోను…అలాంటి గొప్ప స్నేహాలు ఈ కాలంలో లేవని తెలిపారు. తల్లి దండ్రులు వద్దు అంటే అరిచి గొడవ చేసి, మీ డబ్బులు ఇస్తున్నారా అని ఎదురు తిరుగుతున్నారన్నారు.
మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యల్ని భరించాల్సి ఉంటుందని చెప్పారు. జీవితం ఒక్కటే దానిని ఆనందంగా, అల్లకల్లోలం గా మార్చుకోవాలంటే అది మీ చేతల్లోనే ఉందన్నారు. మంచి, చెడు మీకు బాగా తెలిసి నప్పుడు ఎలా ఉండాలో మీరే ఆలోచించుకోవాలని తెలిపారు.
ఈ మధ్య కాలంలో తాగిన మత్తు లో కూతురుని రేప్ చేసిన ఎన్నో కేసులు వింటున్నామని చెప్పారు. మద్యం మత్తు లో మగాడు మృగంగా మారి పోతాడన్నారు. ఆ సమయంలో వావి వరుసలు తెలియవన్నారు. యువతులు మద్యం తాగిన మగవాళ్ల మనసు ఏలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పారు.
అందుకే మీ జీవితం మీ చేతుల్లోనే దానిని కాపాడు కోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉందని చెప్పారు. మన సంస్కృతిని తెలుసుకొని, అందులో విలువైన అంశాలను వెలికి తీసి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని తెలిపారు. నేటి యువత తల్లి దండ్రులు లతో కేవలం 4.8% కాలాన్ని మాత్రమే గడుపుతున్నారని న్నారు.
మితిమీరిన వ్యామోహం (ఇన్ ఫాట్యుయేషన్), డెసిషన్ స్ట్రెస్, ఛాయిస్ లెక్కువ వుండటంతో నెగెటివిజానికి ప్రభావితం అవుతున్నారని చెప్పారు. విజ్ఞత, విచక్షణ కలిగిన యువత ఇటువంటి వాటికి గురికావడం అన్నది చాలా బాధాకరం అని అన్నారు.
నేటి యువతరం ఎంత మంచి పనైనా చేయగలదు, ఎంత వినాశనాన్ని నైనా తీసుకు రాగలరన్నారు. యువతి, యువకులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జ్యోతి రాజా, జి.కృష్ణ వేణి, టి.శోభారాణి పాల్గొన్నారు.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్
@ 9390044031