Thu. Sep 19th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 4, 2024: టైప్ 1 డయాబెటిస్ (T1D)పై తమ సామాజిక ప్రభావ కార్యక్రమం హైపోగ్లైసీ మియా, హైపర్‌గ్లైసీమియాను తగ్గించడానికి సంబంధించి సానుకూల ఫలితాలను అందిస్తోందని రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా (RSSDI), సనోఫీ ఇండియా లిమిటెడ్ (SIL) తెలిపాయి. దాని ఫలితంగా మెరుగైన సంరక్షణ, రోగనిర్ధారణ చోటు చేసుకుంటు న్నాయని పేర్కొన్నాయి.

ప్రామాణిక మార్గదర్శకాల ప్రకారం పిల్లలు, యువకులను ప్రభావితం చేసే ఈ ఆటోఇమ్యూన్ తీవ్రమైన స్థితి రోగనిర్ధారణ, నిర్వహణకు వీలు కల్పించడా నికి సార్వత్రిక ప్రమాణాలతో కూడిన సంరక్షణను రూపొందించడానికి ఈ ప్రోగ్రామ్ సహాయపడింది. ఈ కార్యక్రమం రోగులకు, సంరక్షకులకు, ఆరోగ్య సంరక్షణ నిపుణులకు టైప్ 1 మధుమేహం నిర్వహణపై అవగాహనను అందిస్తుంది.

ఈ పరిస్థితితో జీవిస్తున్న 1,400+ నిరుపేద పిల్లలకు ఉచిత ఇన్సులిన్, సిరంజిలు, లాన్‌సెట్స్, గ్లూకోజ్ స్ట్రిప్స్ కోసం నిధులు అందిస్తుంది. ఈ కార్యక్రమం హైపోగ్లైకేమియాను (వారానికి 1 నుండి 4 సార్లు) ఎదుర్కొంటు న్న పిల్లల సంఖ్యను 46% (వర్సెస్ 70%) హైపర్గ్లైకేమియాను (వారానికి 1 నుండి 4 సార్లు) ఎదుర్కొంటున్న పిల్లల సంఖ్యను 25% (వర్సెస్ 52%) తగ్గించింది.


భారతదేశవ్యాప్తంగా టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతున్న 1400+ మంది పిల్లలు ఈ సోషల్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్‌లో చేరారు, వారిలో 72 మంది పిల్లలు తెలంగాణకు చెందినవారు. భారతదేశంలో జువెనైల్ లేదా ఇన్సులిన్ ఆధారిత డయాబెటిస్‌గా సూచించబడే టైప్ 1 డయాబెటిస్‌తో జీవిస్తున్న వ్యక్తులు, వారి సంరక్షకులు మధుమేహ నిర్వహణలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే T1Dకి చికిత్స చేయడానికి, నిర్వహించడానికి శిక్షణ పొందిన వైద్యులు, ఎడ్యుకేటర్స్, పోషకాహార నిపుణులు, ఇతర సహాయక సిబ్బందితో కూడిన ప్రత్యేక కేంద్రాలు చాలా తక్కువ. T1D కి సంబంధించి ప్రజలకు అవగాహన లేకపోవడంపై ఇతర సవాళ్లలో ముఖ్యంగా సెమీ – అర్బన్,  గ్రామీణ ప్రాంతాల సామాజిక ఆర్థిక భారం, సరైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ను పొందడం వంటి అంశాలున్నాయి.


ఆలస్యమైన రోగనిర్ధారణ, ఇన్సులిన్ కు సంబంధించి పేలవమైన కోల్డ్ చైన్ మేనేజ్‌మెంట్ నిర్వహణ, రోగులు, సంరక్ష కులకు తగినంత అవగాహన అందించకపోవడం వంటి సంక్లిష్టతల కారణంగా పై సమస్యలు జటిలమయ్యాయి. అంతేగాకుండా టైప్ 1 మధుమేహం ఉన్న వ్యక్తులు ముఖ్యంగా బాలికలు సామాజిక ఒంటరితనం ఎదుర్కొంటున్నా రని కూడా గమనించవచ్చు. ఈ సామాజిక ప్రభావ కార్యక్రమం ద్వారా మేం మాతో చేరడానికి ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు అవగాహన కల్పిస్తున్నాం, T1Dని తక్షణమే నిర్ధారించడంలో సహాయం చేస్తాం. తద్వారా ప్రతి వ్యక్తికి 3 సంవత్సరాల ఆరోగ్యకర జీవితాన్ని పునరుద్ధరించవచ్చు. అదేవిధంగా, ఇన్సులిన్ యాక్సెస్, టెస్ట్ స్ట్రిప్స్,మంచి స్వీయనిర్వహణ, ఒక వ్యక్తికి 21.2 సంవత్సరాల ఆరోగ్యకర జీవితాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతాయి.


మధుమేహానికి సంబంధించి పై సమస్యలను పరిష్కరించడానికి, పిల్లలు, యువకులలో సకాలంలో, మెరుగైన మధు మేహ నిర్వహణ కోసం ప్రామాణిక సంరక్షణను రూపొందించడంలో సహాయపడే సామాజిక ప్రభావ కార్య క్రమాన్ని రూపొందించడానికి  భారతదేశ ప్రముఖ జాతీయ సంస్థ RSSDI, సనోఫీ ఇండియా జనవరి 2021లో చేతులు కలిపాయి. పీపుల్ టు పీపుల్ హెల్త్ ఫౌండేషన్ (PPHF) ఈ సామాజిక ప్రభావ కార్యక్రమాన్ని అమలు చేసే భాగ స్వామిగా నియమించబడింది.


డాక్టర్ రాకేశ్ సహాయ్
MD, DNB, DM ఎండోక్రినాలజీ 
ఎండోక్రినాలజిస్ట్
ప్రెసిడెంట్ – రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా (RSSDI)
 “భారతదేశంలో సుమారు 8.6 లక్షల మంది T1D రోగులు ఉన్నారు.  ఈ పరిస్థితితో జీవిస్తున్న పిల్లల అత్యవసర అవ సరాలను మనం పట్టించుకోకుండా ఉండలేం. ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఎడ్యుకేటర్స్ ను అవసరమైన సాధనాలు, జ్ఞా నంతో సన్నద్ధం చేయడం ద్వారా, ఈ కార్యక్రమం పిల్లలు అభివృద్ధి చెందడానికి అవసరమైన విధంగా, సకాలంలో రోగ నిర్ధా రణ, తగిన మధుమేహ నిర్వహణకు వీలు కల్పిస్తుంది”.

డాక్టర్ సంజయ్ అగర్వాల్
MD, FACE, FACP 
డయాబెటాలజిస్ట్ 
 “ఈ కార్యక్రమం కోసం, RSSDI, సనోఫీ ఇండియా తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని మిళితం చేసి అంత ర్జాతీయంగా అమల్లో ఉన్నసిఫార్సుల ప్రకారం భారతదేశం అంతటా చికిత్సకు యాక్సెస్‌ను అందించే సార్వత్రిక ప్రమాణిక సంరక్షణ (యూనివర్సల్ స్టాండర్డ్ ఆఫ్ కేర్‌)ను రూపొందిస్తున్నాయి. భారతదేశంలో T1D సంరక్షణ తీరుతెన్నులను  మార్చడానికి RSSDI కట్టుబడి ఉంది”.

గ్లోబల్ టైప్ 1 డయాబెటిస్ ఇండెక్స్ ప్రకారం, టైప్ 2 డయాబెటిస్ కి సంబంధించి 4.4% తో పోలిస్తే భారతదేశంలో T1D ప్రతి సంవత్సరం 6.7% పెరుగుతోంది.

అదేవిధంగా టైప్ 1 డయాబెటిస్ ఇండెక్స్ ప్రకారం యునైటెడ్ కింగ్‌డమ్‌లో టైప్ 2 డయాబెటిస్‌కు సంబంధించి 3.6%తో పోలిస్తే T1D ప్రతి సంవత్సరం 3.5% పెరుగుతోంది. అదేవిధంగా, టైప్ 1 డయాబెటిస్ ఇండెక్స్ ప్రకారం, అమెరికాలో, టైప్ 2 డయాబెటిస్‌కు సంబంధించి 4.5%తో పోలిస్తే ప్రతి సంవత్సరం T1D 2.9% పెరుగుతోంది.
సనోఫీ ఇండియా లిమిటెడ్ మద్దతుతో RSSDI ద్వారా టైప్ 1 డయాబెటిస్ కు సంబంధించిన ఈ సోషల్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్, భారత దేశం అంతటా శిక్షణ పొందిన ఆరోగ్య సంరక్షణ నిపుణులు (HCPలు) మరియు T1D ఎడ్యుకేటర్స్ నెట్‌వర్క్‌ను సృష్టించడం ద్వారా T1D రోగుల ఆరోగ్య స్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
వైద్యులకు శిక్షణ ఇవ్వడం అనేది సరైన రోగనిర్ధారణ, నిర్వహణకు వీలు కల్పిస్తుంది. ఇది దీర్ఘకాలిక సమస్యలు చోటు చేసుకునే అవకాశాన్ని తగ్గించడానికి దారి తీస్తుంది. T1D సకాల నిర్ధారణ కోసం వైద్యులలో సామర్థ్యాన్ని పెంపొం దించడానికి మరియు T1D రోగులు, వారి సంరక్షకులకు సంరక్షణ, నిర్వహణ నైపుణ్యాలకు సంబంధించి T1D ఎడ్యుకేటర్స్ కోసం RSSDI రెండు సెట్ల మాడ్యూల్స్ ను రూపొందించింది. ఈ ప్రయత్నం ద్వారా T1D  వ్యక్తులు మెరుగైన జీవితాన్ని గడపడానికి సహాయం చేయగలమని మేం ఆశిస్తున్నాం.

అపర్ణా థామస్
సీనియర్ డైరెక్టర్, కార్పొరెట్ కమ్యూనికేషన్స్ అండ్ కార్పొరెట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ,
సనోఫీ ఇండియా 
“భారతదేశంలో టైప్ 1 డయాబెటిస్‌తో జీవిస్తున్న చాలా మంది పిల్లలలో చాలా త్వరగా జీవన నాణ్యతను మెరుగుపరిచిన మా సామాజిక కార్యక్రమం ప్రభావంతో మేం ఎంతో స్ఫూర్తిని పొందాం. టైప్ 1 డయా బెటిస్‌లో దాని నిర్ధారణ, అవగాహన, కౌన్సెలింగ్ కోసం ఎంతో అవసరమైన ప్రామాణిక సంరక్షణ (స్టాండర్డ్ ఆఫ్ కేర్‌)ను రూపొందించడానికి ప్రోగ్రామ్ రూపొందించబడింది. ఈ ప్రోగ్రామ్ వైద్యులు, ఎడ్యుకేటర్స్ సంఖ్య ను పెంచడానికి T1D శిక్షణను సులభతరం చేస్తుంది.  T1D నిర్ధారణ, చికిత్స, సంరక్షణకు అవకాశాన్ని అందిస్తుంది. సనోఫీ ఇండియా యొక్క సోషల్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ 1400+ పిల్లలకు ఉచిత ఇన్సులిన్ కోసం నిధులను అందిస్తోంది. ఆ పిల్లలు తమ T1Dని సరైన విధంగా నిర్వహించడానికి చికిత్సను యాక్సెస్ చేయడానికి ఈ ఆర్థిక సహాయం అవసరం”.


డాక్టర్ బిపిన్ సేథి
ఎండీ, మెడిసిన్ డీఎం ఎండోక్రినోలజీ 
“టైప్ 1 మధుమేహం (T1D) అనేది చాలా ప్రబలంగా ఉన్న, ఆమోదించబడిన టైప్ 2 డయాబెటిస్‌కు భిన్నమైనది మరియు దాంతో పోల్చలేని స్థితిగతులను కలిగి ఉంటుంది. T1Dకి ఇన్సులిన్ ఆమోదం పొందడంఅంత గొప్ప సమస్య ఏమీ కాదు. కాకపోతే ఇన్సులిన్ డెలివరీ సూక్ష్మబేధాలు, నియంత్రణను నిర్వహించడం (బాగా పెరిగిపోకుండా నివారించేటప్పుడు), హైపర్, హైపోగ్లైసీమియా ట్రఫ్‌లను బట్టి, సవాలు చాలా పెద్దది. ఇది ఆర్థిక పరిమితులు, సరిపోని మద్దతు, అంతంత మాత్రం అవగాహనతో మరింత తీవ్రమవుతుంది. సమాజం, పాఠశాల, ఆరోగ్య సంరక్షణ నిపుణుల నుండి అవసరమైన సహానుభూతి పొందలేకపోవడాన్ని మించింది.  టైప్ 1 డయాబెటిస్ గురించి వివిధ ఫోరమ్‌లలో చర్చించడం ద్వారా,  తెలంగాణలోని హెచ్‌సిపిలు, ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా, మేము టైప్ 1 డయాబెటిస్‌తో జీవిస్తున్న వారికి గణనీయమైన మార్పును తీసుకురాగలం”. టైప్ 1 డయాబెటిస్‌ను మెరుగ్గా ఎదుర్కోవడం గురించి మరింత తెలుసుకోవడానికి మరియు దాని పై  లోతుగా పాతుకుపోయిన అపోహలను తొలగించడానికి, సందర్శించండి: https://www.rssdi.in/newwebsite/type-1-diabetes-videos.php

error: Content is protected !!