365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, స్టాక్‌హోమ్,అక్టోబర్ 6,2022: సాహిత్యంలో 2022 సంవత్సరానికి గాను ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్ ను నోబెల్ బహుమతి వరించింది. ‘ఫర్ ది కరేజ్ అండ్ క్లినికల్లీ ఏక్యుటీ’ అనే పేరుతో జ్ణాపకశక్తి మూలాలపై చేసిన రచనలకు గాను ఆమెకు నోబెల్ ప్రైజ్ లభించింది. సాహిత్య రంగంలో అన్నీ ఎర్నాక్స్ అందించిన విశేష సేవలకు ఈ అత్యున్నత పురస్కారం లభించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
![The winner of the 2022 Nobel Prize in Literature is French author Annie Ernauz](http://365telugu.com/wp-content/uploads/2022/10/French-author-Annie-Ernauz.jpg)
1940లో నార్మాండీలోని యెవెటోట్ అనే చిన్న పట్టణంలో ఎర్నాక్స్ పుట్టి పెరిగారు. అక్కడే తల్లిదండ్రులతో కలిసి ఓ కేఫ్‌ను నడిపిన ఎర్నాక్స్.. రచయితగా సుదీర్ఘమైన ప్రయాణాన్ని కొనసాగించారు. గత కొన్నేళ్లుగా నోబల్ పురస్కారం ఆమెకు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. 1901 నుంచి ఇప్పటివరకు 119మందికి సాహిత్య నోబెల్ పురస్కారాలు ప్రదానం చేయగా ఈ జాబితాలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన 17వ మహిళగా అన్నీ ఎర్నాక్స్ నిలిచారు.