Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 22,2024:ప్రపంచదేశాల్లో అనేక చోట్ల నీటి కొరత ఏర్పడుతోంది. కాబట్టి ప్రతిఒక్కరూ నీటి ఆదా చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

నేడు వరల్డ్ వాటర్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.. ఇంట్లో నల్లాల వాడకం తగ్గించి బకెట్ , మగ్గు ద్వారా నీలను వినియోగిస్తే చాలావరకూ నీరు ఆదా అవుతుంది.

ఇళ్ళలోనే కాకుండా పబ్లిక్ పార్కులు, వీధులు, ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి ప్రదేశాలలో కూడా కుళాయిలు పాడైపోయినా లేదా పైపులు లీక్ అయినట్లయితే, దాని గురించి సంబంధిత కార్యాలయానికి తెలియజేయండి. దీంతో వేల లీటర్ల నీటి వృథాను అరికట్టవ

పైప్ వాడకుండా వాటర్ క్యాన్ ద్వారా గార్డెన్ లోనూ, ఇంటి చుట్టుపక్కల ఉండే మొక్కలకు నీళ్లు పోస్తే చాలా నీరు ఆదా అవుతుంది.

 తోటకు పగటి పూట కాకుండా రాత్రి పూట నీరు పోస్తే మంచిది. దీని వల్ల నీరు ఆవిరైపోదు. తక్కువ నీటితో చెట్లు, మొక్కలు ఎండిపోకుండా ఉంటాయి.

పొలాల్లో నీటిపారుదల కోసం తక్కువ ఖర్చుతో కూడిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా కూడా పెద్ద మొత్తంలో నీటిని ఆదా చేయవచ్చు.