365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 26,2025:హైడ్రా సంస్థ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ ఇద్దరిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. మిరియాల వేదాంతం, యెలిసెట్టి శోభన్ బాబు అనే ఇద్దరు వ్యక్తులు గండిపేట మండలం, నెక్నాంపూర్ గ్రామంలోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఉన్న ఓ ఇంటి వద్దకు వచ్చి బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3.20 గంటల సమయంలో, నలుపు రంగు కారులో వచ్చిన ఈ ఇద్దరూ ఇంటి ఆవరణలోకి ప్రవేశించి పరిసరాలను పరిశీలించసాగారు. ఈ క్రమంలో అక్కడ పని చేస్తున్న గుంతకల్ మల్లికార్జున్ అనుమానం వ్యక్తం చేసి వారిని ప్రశ్నించగా, తాము హైడ్రా సంస్థ నుంచి వచ్చామని సమాధానం ఇచ్చినట్టు తెలిపారు.
అలాగే, “ఈ ఇంటిని కూల్చివేయాల్సి ఉంది, దానికోసం సమాచారం సేకరిస్తున్నాం” అంటూ బెదిరించినట్టు చెప్పారు. ఇంటి యజమానిని కలవాలని సూచించగా వారు అక్కడి నుండి వెళ్లిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి…ఫోర్స్ మోటార్స్ డీలర్ నెట్‌వర్క్‌ల డిజిటల్ పరివర్తన కోసం జోహోతో భాగస్వామ్యం..
Read This also…Force Motors Partners with Zoho to Drive Nationwide Digital Transformation Across Dealer Network..
Read This also…New Zealand Tops Academic Reputation Among English-Speaking Nations in QS World University Rankings 2026..
Read This also…Synchrony India Ranked #2 Among India’s Best Companies to Work For™ 2025 by Great Place to Work®..
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, మిరియాల వేదాంతం (వయసు 22) కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడు కరీంనగర్ జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ప్రస్తుతం అల్కాపూర్ టౌన్‌షిప్‌లో నివసిస్తున్నాడు. మరో నిందితుడు యెలిసెట్టి శోభన్ బాబు ఆర్టీసీలో పని చేసి పదవీ విరమణ పొందారు. ఆయన మణికొండలోని పుప్పాలగూడలో ఉన్న ఎస్టీమ్ రెసిడెన్సీలో నివాసముంటున్నారు. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

హైడ్రా సంస్థ హెచ్చరిక – పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు
హైడ్రా సంస్థ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ, తమ సంస్థ పేరుతో ఎవరైనా మోసాలకు, బెదిరింపులకు పాల్పడితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అలాంటి ఘటనలపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో తక్షణమే ఫిర్యాదు చేయాలని కోరింది.
అలానే, తమ సంస్థ ఉద్యోగులు విచారణ చేపడితే, తగిన అధికారిక సమాచారం అందిస్తారని తెలిపింది. హైడ్రా ఉద్యోగులే సంస్థ పేరును దుర్వినియోగం చేస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఎవరికైనా మోసాల గురించి సమాచారం ఉంటే, వాట్సాప్ నంబర్ 8712406899కు ఫొటోలు సహా సమాచారాన్ని పంపించాలని సంస్థ కోరింది.