365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే 4,2023: ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే ఢిల్లీలోని ఈ ప్రాంతాల్లో డెడ్ చీప్ గా షూస్, స్లిప్పర్స్ దొరుకుతాయి. బ్రాండెడ్ వస్తువులు సైతం చాలా టాక్కువధరకే లభిస్తాయి. ఆయా మార్కెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే..?
ఆర్య సమాజ్ మార్కెట్..
ఈ ప్రసిద్ధ మార్కెట్ ఉత్తమ్ నగర్‌లో ఉంది. ట్రెండింగ్ దుస్తుల నుంచి చవక పాదరక్షల వరకు ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ మీరు దాదాపు రూ.150 నుంచి రూ.400 వరకు అత్యుత్తమ డిజైనర్ దుస్తులను కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు మీకు ఇక్కడ బ్రాండెడ్ పాదరక్షలు కూడా కొనొచ్చు.
కరోల్ బాగ్..
ఢిల్లీ కరోల్ బాగ్‌ను UPSC సన్నాహాల హబ్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ మార్కెట్ మొత్తం దేశంలోనే చౌకైన వస్తువులకు ప్రసిద్ధి. ఇక్కడ మీరు చౌకైన, మంచి బూట్లు కొనుగోలు చేయవచ్చు, ఇక్కడ బ్రాండెడ్ బూట్లు రూ.400లకే దొరుకుతాయట.
చప్పల్ వలీ గల్లీ..
చప్పల్ వలీ గల్లీ ఇది మార్కెట్‌లోని పురాతన వీధి. ఇక్కడ మీరు చౌకగా బ్రాండెడ్ చెప్పులు, బ్రాండెడ్ డ్రెస్ లు, బ్రాండెడ్ చెప్పులు మొదలైనవి కొనుగోలు చేయవచ్చు. లెదర్ చెప్పులు కూడా 20-30 రూపాయలలోపే ఇక్కడ లభిస్తాయట.
మహిపాల్‌పూర్ ఫ్యాక్టరీ అవుట్‌లెట్..
మహిపాల్‌పూర్ రోడ్‌లో అనేక ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్ ఉంటాయి. ఇక్కడ బూట్లు MRP కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. అడిడాస్, నైక్, వుడ్‌ల్యాండ్, ప్యూమా అండ్ రీబాక్ వంటి కొన్ని అవుట్‌లెట్‌లు మీరు గొప్ప డిజైన్‌లను తక్కువ ధరలతో కొనుగోలు చేయవచ్చు.