365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 11,2025: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ ఎంట్రప్రెన్యూలు (సంస్థాపకులు)తో ఇటీవల జరిగిన సమావేశంలో అమెరికాను క్రిప్టోకరెన్సీ రంగంలో అగ్రస్థానంలో నిలపాలనుకుంటున్నట్లు ప్రకటించారు.

అంతేకాకుండా, అమెరికా తమ విదేశీ మారక నిధుల నిల్వలను క్రిప్టోకరెన్సీలో ఏర్పాటు చేసుకునే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనలతో భారత్‌లోని క్రిప్టోకరెన్సీ రంగానికి చెందిన వ్యాపారవేత్తలు ఉత్సాహంగా ఉన్నారు.

అయితే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇప్పటికీ క్రిప్టోపై తన ఉద్దేశాన్ని మార్చుకోలేదు.

ఇది కూడా చదవండి…బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగాలు– గ్రాడ్యూయేట్లకు అద్భుత అవకాశం!

ఇది కూడా చదవండి…WPL 2025: గుజరాత్‌పై ముంబైకి వరుసగా ఆరో విజయం

భారత ప్రభుత్వ వైఖరి ఏంటి?
ఆర్బీఐ ఇప్పటికీ క్రిప్టోకరెన్సీని గుర్తింపు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా దీనిపై ఏవైనా నిర్ణయాలు త్వరలో తీసుకోవడం లేదు. క్రిప్టోకరెన్సీపై ఏర్పాటైన ఆర్బీఐ ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా మాత్రమే భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ నివేదిక త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

భారత ప్రభుత్వానికి ఉన్న అనుమానాలు?
భారత ప్రభుత్వ విధానాలపై అవగాహన ఉన్న ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ, క్రిప్టోపై ఇప్పటికీ భారత ప్రభుత్వం,ఆర్బీఐ వద్ద అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా మూడు ప్రధాన కారణాలను ఆయన ప్రస్తావించారు:

క్రిప్టోకరెన్సీకి అధికారం ఇచ్చిన అధికారిక సంస్థలు లేవు, దీని వల్ల ఇది మాన్యువల్ కరెన్సీగా ఉపయోగపడదని ఆందోళన ఉంది.

క్రిప్టో సంపూర్ణ ఆర్థిక వ్యవస్థను నడిపించగలదని నిరూపించిన పరిశోధన ఇంకా లేదు.
ఇది వ్యక్తిగత చెల్లింపు విధానంగా ఉపయోగపడగలదా? అనే ప్రశ్న ఇప్పటికీ సమాధానం పొందలేదు.

ఇది కూడా చదవండి…పాసుపుస్తకాలతో పాత లే ఔట్ల కబ్జాలు.. హైడ్రా ప్రజావాణికి అందిన 63 ఫిర్యాదులు..

ఇది కూడా చదవండి…మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా శ్రీలీలకు ప్రత్యేక సన్మానం

ఈ అంశాలపై స్పష్టత రాకపోతే, భారత ప్రభుత్వం తన విధానాన్ని మార్చే అవకాశం తక్కువేనని అధికారులు చెబుతున్నారు.

ఆర్బీఐ వైఖరి..
ఇప్పటి వరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తన కఠినమైన వైఖరిని కొనసాగిస్తోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గతంలో అనేకసార్లు క్రిప్టోకరెన్సీ భారత్‌కు ప్రమాదకరమని పేర్కొన్నారు. 2019లోనే సుభాష్ చంద్ర గర్గ్ నేతృత్వంలోని ప్రభుత్వ కమిటీ క్రిప్టోను నిషేధించేలా చట్టం తీసుకురావాలని సిఫార్సు చేసింది.

అమెరికా నిర్ణయాల ప్రభావం భారతీయ విధానంపై ఉంటుందా?
భారత ప్రభుత్వం, అమెరికా తీసుకునే నిర్ణయాలను గమనిస్తోంది. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాల కన్నా, భారత ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వబోయేది ఆర్బీఐ సూచనలకు మాత్రమే. ఇక, వర్చువల్ కరెన్సీలకు సంబంధించి ఆర్బీఐ ఏదైనా సడలింపు సూచిస్తుందా లేదా పూర్తి నిషేధంపైనే నిలిచిపోతుందా అన్నది వేచి చూడాలి.

మొత్తానికి, ప్రపంచ ఆర్థిక రంగంలో క్రిప్టోకరెన్సీ దూసుకుపోతున్నా, భారత్ మాత్రం ఇంకా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.