365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 6,2024: డిజిటల్ పెన్,ఇంక్ సొల్యూషన్స్, ప్రముఖ ఆవిష్కర్త వాకోమ్ తన మొట్టమొదటి ఓలెడ్ పెన్ డిస్ ప్లే.. వాకోమ్ మూవింక్ ను నేడు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
సృజనాత్మకత గల వృత్తి నిపుణులు, డిజిటల్ ఆర్టిస్టులు, డిజైన్ స్టూడెంట్ల అవసరాలకు అనుగుణంగా ఓలెడ్ పెన్ ను రూపొందించినట్లు పేర్కొంది.
వాకోమ్ ప్రో పెన్ 3 అందించే ప్రొఫెషనల్ పెన్ అనుభవంతోపాటు అద్భుతమైన 13.3” అంగుళాల పూర్తి హెచ్ డి ఓలెడ్డిస్ ప్లేతో సూపర్ స్లిమ్ గా కనబడే, అల్ట్రా లైట్, పోర్టబుల్ పరికరమైన వాకోమ్ మూవింక్ సరికొత్త ఉత్పత్తి కేటగిరిలో అందుబాటులో ఉండే ధరకే దొరుకుతుంది.
ఎందుకంటే ఇది అనేక ఆపరేటింగ్ సిస్టమ్ లపై పనిచేస్తుంది కాబట్టి వినియోగదారులు దీని పనితీరు, కచ్చితత్వం, ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ పై ఏ మాత్రం రాజీపడనవసరం లేకుండా అన్ని సాఫ్ట్ వేర్ అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుంది.
“వాకొమ్ అద్భుతమైన తన కొత్త ఉత్పత్తిని లాంచ్ చేయడం ద్వారా డిస్ ప్లే టెక్నాలజీ రంగం భావితరంలోకి అడుగుపెట్టింది. అద్భుతమైన 13.3” అంగుళాల, పూర్తిస్థాయి హెడ్ ఓలెడ్ డిస్ ప్లేతో సూపర్ స్లిమ్ గా ఉండే, అల్ట్రాలైట్, దృఢమైన వాకోమ్ మూవింక్.. డ్రాయింగ్, ఇంకింగ్ ను తన మూవింగ్ , పోర్టబులిటితో ఏకం చేస్తుంది. పనితీరులో ఏమాత్రం రాజీ పడకుండా కచ్చితత్వంతో పనిచేస్తుంది” అని వాకోమ్ ఇండియా డైరెక్టర్ రాజీవ్ మాలిక్ అన్నారు.
వాకోమ్ మూవింక్ అనేది ఆకట్టుకునే సున్నితమైన పెన్, టిల్ట్ డిటెక్షన్ తో శక్తిమంతమైన బ్రష్ స్ట్రోక్ ల నుంచి సున్నితమైన గీతల వరకూ విస్తృత శ్రేణి కళాత్మక భావ వ్యక్తీకరణలను అందించే వాకోమ్ ప్రో పెన్ 3* అంకితభావంతో కూడిన వెర్షన్. పెరిగిన పెన్ డిటెక్షన్ ఎత్తు, కనిపించని పారలాక్స్ తోపాటు వేగమైన ప్రతిస్పందన సమయాన్ని వాకోమ్ మూవింక్ సాధిస్తుంది.
విండోస్, మాక్ ఓఎస్, క్రోమ్ ఓఎస్ , ఆండ్రాయిడ్ ఆరేటింగ్ సిస్టమ్ లకు వాకోమ్ మూవింక్ అనుకూలంగా ఉంటుంది. సపోర్ట్ చేసిన రిమోట్ డెస్క్ టాప్ కనెక్షన్లపై పనిచేయడాన్ని మెరుగు పరిచే వాకోమ్ బ్రిడ్జ్.. వాకోమ్ మూవింక్ కు పూర్తి మద్దతు అందిస్తుంది. వాకోమ్ మూవింగ్ 13 రూ.72,999 ధరకు లభిస్తుంది.