Mon. Oct 7th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్ , హైదరాబాద్ , ఆగష్టు 9,2020:ఆధునికంగా అభివృద్ధి పరచిన కోవిడ్ సంబంధ టెక్నాలజీల మీద, ప్రత్యేకంగా నీటిని శుద్ధి చేసే టెక్నాలజీలమీద శుక్రవారం నాడు ఒక వెబినార్ జరిగింది. ఇందులో సిఎస్ ఐ ఆర్- సి ఎం ఇ ఆర్ ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ హరీష్ హిరాణి, పాట్నాకు చెందిన -డిఐ డైరెక్టర్ శ్రీ విశ్వమోహన్ ఝా ప్రధాన ప్రసంగాలు చేశారు. ఎం ఎస్ ఎం ఇ కిందికి వచ్చే పరిశ్రమలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తాజా సాంకేతిక పరిజ్ఞానం పట్క అవగాహన పెంచుకోవటం ఈ వెబినార్ ప్రధాన లక్ష్యం. దీని ద్వారా పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అందిస్తూ, సిఎస్ ఐ ఆర్- సి ఎం ఇ ఆర్ ఐ దగ్గర అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి అవగాహన కల్పించటం ధ్యేయంగా పెట్టుకున్నారు.సిఎస్ ఐ ఆర్- సి ఎం ఇ ఆర్ ఐ రూపొందించి అందుబాటులో ఉంచిన టెక్నాలజీల గురించి ప్రొఫెసర్ హీర్వాణి సవివరంగా, అత్యంత విశ్లేషణాత్మకంగా తెలియజేశారు. స్థానిక ప్రతిభను ఎక్కువగా వాడుకోవటం మీద ప్రధానంగా దృష్టి సారించాలని నాయన ఈ సందర్భంగా కోరారు. అప్పుడే భారత్ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉత్పత్తికి ఉన్న డిమాండ్ ను అత్యంత సమర్థంగా సక్రమంగా వాడుకోగలుగుతుందన్నారు. సుస్థిరతా సాధనకు, స్థానిక మానవ వనరుల వినియోగానికి ఇది ఉపయోగపడుతుందని, ప్రాంతీయ సమస్యలకు అనువైన సామాజిక-ఆర్థిక పరిష్కారాలు కనుగొనగలుగుతుందని అన్నారు. ఒక క్రమపద్ధతిలో రూపొందించుకున్న ఆలోచనా విధానంతో ప్రాంతీయ వైవిధ్యం సాధించటానికి బలమైన పునాదులు పడతాయని అభిప్రాయపడ్దారు.
రోజువారీ వ్యర్థాల నిర్వహణకు ఇప్పుడు డిస్పోజబుల్ మాస్కులు తోడవటం అధికారులకు పెద్ద సవాలుగా మారిందని అన్నారు. దీనికి ప్లాస్మా ఆర్క్ మెడికల్ వేస్ట్ డిస్పోసబుల్ సిస్టమ్ బాగా సహాయకారి అవుతుందన్నారు. ఆస్పత్రులలో రక్షణకు పనికొచ్చే రోబోటిక్ పరికరం, తాకాల్సిన అవసరం లేని సబ్బు, నీరు అందించే పరికరం, బాటరీ సాయంతో ఇన్ఫెక్షన్ ను నివారించే స్ప్రేయర్, గాఢ ఆక్సిజెన్ తో వచ్చేయాంత్రిక వెంటిలేటర్ ఈ సందర్భంగా అక్కడ ప్రదర్శించారు. ఎం ఎస్ ఎమ్ ఇ రంగం ఇలాంటి ఉత్పత్తుల తయారీని ఎంచుకోవచ్చునని, తద్వారా నిలదొక్కుకోవచ్చునని సూచించారు. ఇప్పటికే కోవిడ్ నిరోధానికి సంబంధించిన 13 టెక్నాలజీలను ఎం ఎస్ఇ లకు బదలీ చేశామన్నారు.
పట్టణ ప్రాంతాలలో మురుగు నీరు పోటెత్తటానికి ప్రధాన కారణం డ్రెయినేజ్ వ్యవస్థలలో అవరోధాలు ఏర్పడటమేనని డాక్టర్ హీరాణి అన్నారు. సిఎస్ ఐ ఆర్- సి ఎం ఇ ఆర్ ఐ యాంత్రిక మురుగునీటి శుద్ధి వ్యవస్థను రూపొందించిందని, నిరంతర ఎదురయ్యే ఈ సమస్యకు ఇదే తగిన పరిష్కారమని అన్నారు. పూర్తి స్థాయిలో నీటి శుద్ధికి సైతం టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చామన్నారు. దీనివలన బీహార్ లాంటి చోట ప్రధానంగా ఎదుర్కుంటున్న త్రాగు నీటి కాలుష్యాన్ని అడ్డుకోవటం సాధ్యమవుతుందని చెప్పారు. ఇది తక్కువ ఖర్చులో, తక్కువ విద్యుత్ వినియోగంతో అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానమని చెప్పారు. ఇనుము, ఆర్సెనిక్, ఫ్లోరైడ్ లాంటివి తొలగించటానికి ఈ టెక్నాలజీ పనికొస్తుందని, ఆ విధంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నీటివనరులను శుద్ధి చేయటం సులభమవుతుందని అన్నారు. ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే 47 ఎం ఎస్ఇ లకు బదలీ చేశామన్నారు. దీన్ని బట్టి వీటికి ఎంత ప్రాచుర్యం లభించిందీ అర్థమవుతున్నదన్నారు.శ్రీ విశ్వమోహన్ ఝా, బీహార్ పరిశ్రమ ప్రతినిధులు, భోజ్ పూర్ వాణిజ్య మండలి, పలువురు నిపుణులు ఈ వెబినార్ లో పాల్గొని డాక్టర్ హీరాణి కృషిని అభినందించారు. అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున కోవిడ్ సంక్షోభం ఎదురైన సమయంలోనూ సిఎస్ ఐ ఆర్- సి ఎం ఇ ఆర్ ఐ పోషిస్తున్న పాత్రను ప్రత్యేకంగా ప్రశంసించారు. సంస్థ ఆవిష్కరించిన టెక్నాలజీలను వాడుతూ దేశాభివృద్ధి కోసంజరిగే కృషిలో ఎప్పటికీ పాలుపంచుకోవాలన్నదే తన అభిమతమని శ్రీ ఝా మరోమారు చెప్పారు

error: Content is protected !!