365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 26, 2025 : ఆరుపదుల నుంచి ఏడుపదుల వయసు దాటిన తర్వాత రక్తపోటు సమస్య తలెత్తుతుంది. వృద్ధులలో 10శాతం నుంచి 44శాతం మందిలో రక్తపోటు కనబడుతుంది.
గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవాళ్ళకంటే పట్టణప్రాంతాల్లో ఉండే వృద్ధులలో సమస్య ఎక్కువగా ఉంటుంది. స్త్రీలలో కంటే పురుషులలో రక్తపోటు ఎక్కువమందిలో కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి..లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320A ఆధ్వర్యంలో ఘనంగా లైషా ఉత్సవ్..
Read this also…Digital Tax on Online Advertisements Removed – Effective from April 1
ఇది కూడా చదవండి..హైదరాబాద్‌లో వరద, అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు – హైడ్రా, జీహెచ్‌ఎంసీ సమీక్ష
కొంతమందిలో 30 – 40 సంవత్సరాలకే రక్తపోటు కనబడుతుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడ ఆ సమస్య కొనసాగుతుంది. కొందరికి కాంప్లికేషన్లు కూడా -పెరుగుతాయి.
వృద్ధాప్యంలో ప్రత్యేకంగా కనబడే రక్తపోటు

వృద్ధాప్యం రావడంతో రక్తనాళాల గోడలు గట్టిపడతాయి. దీనినే ఎథిరోస్క్లెరోటిక్ కండిషన్ అంటారు. ఎథిరోస్క్లెరోటిక్ కండిషన్ ఏర్పడటంవల్ల కీళ్ళల్లో పైరీడింగ్ (సిస్టాలిక్
రీడింగ్) ఎక్కువగా ఉంటుంది. క్రింది రీడింగ్ (డయోస్టాలిక్ రీడింగ్) నార్మల్గా ఉంటుంది.
ఈరకమైన రీడింగ్తో ఎథిరోస్క్లెరోటిక్ హైపర్టెన్షన్ నెలకొందని గుర్తించవచ్చు. మామూలు రక్తపోటులో పై రీడింగ్తో పాటు క్రింది రీడింగ్ కూడా ఎక్కువ లెవెల్లో ఉంటుంది.
కొంతకాలం క్రిందటి వరకు వృద్ధాప్యంలో వచ్చే ఇటువంటి ఎథిరోస్క్లెరోటిక్ హైపర్టెన్షన్, చికిత్స ఏమీ అవసరంలేదని, దానికి ఏ మందులు లేవని అనేవారు. కాని రాను రాను ఎథిరోస్క్లెరోటిక్ హైపర్టెన్షన్వల్ల హాని ఉందని గుర్తించారు.
దానికి కూడాచికిత్స చేయాలని నిర్ధారణకు వచ్చారు. ఎథిరోస్క్లెరోటిక్ హైపర్టెన్షన్నే ఐసోలేటిక్ సిస్టాలిక్ హైపర్టెన్షన్గా పేర్కొంటారు. ఇసోలేటెడ్ సిస్టాలిక్ హైపర్టెన్షన్ వల్ల గుండె పెరగడం, మెదడులో రక్తనాళాలు చిట్లడం జరుగుతుంది.
వృద్ధాప్యంలో వచ్చే ఈ ప్రత్యేక రక్తపోటుకి అంతగా బాధలు కనబడవు. సాధారణంగా చేసే హెల్త్ చెకప్లో బయటపడుతుంది.
సాధారణ రక్తపోటు ఉన్నవాళ్ళల్లో తలనొప్పి, తల తిరగడం, అలసట, గుండెలో దడ ఉంటాయి. కొందరిలో ముక్కు నుంచి రక్తం కూడ కారుతుంది. వృద్ధాప్యంలో వచ్చే ప్రత్యేక రక్తపోటులో ఈ బాధలు అంతగా ఉండవు.