365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 1,2024: మనం నిత్య జీవితంలో ఎన్నో వస్తువులను ఉపయోగిస్తాం. వీటిలో కొన్నింటి గురించి మనకు తెలుసు. కానీ చాలా తక్కువ మందికి తెలిసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవే వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్. ప్రతి ఇంట్లో ఈ రెండు రకాల సామగ్రి వాడుతుంటారు. అసలు వైట్ గూడ్స్,బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం..
వైట్ గూడ్స్ అంటే ఏమిటి..?
వైట్ గూడ్స్ అనేవి గృహోపకరణాలు, ఇవి పరిమాణంలో పెద్దవి, రోజువారీ జీవితంలో ఉపయోగిస్తారు. వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్, ఫ్రీజర్, డిష్‌వాషర్,ఎయిర్ కండీషనర్ వంటి వాటిని వైట్ గూడ్స్ కు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇటువంటి వస్తువులు సాధారణంగా తెల్లగా ఉంటాయి. అందుకే వాటిని వైట్ గూడ్స్ అంటారు.
ప్రస్తుతం మార్కెట్లో గృహోపకరణాలు అనేక రంగుల్లో లభిస్తున్నాయి. కానీ ఇప్పటికీ వీటిని వైట్ గూడ్స్ అంటారు. ఇవి రోజువారీ ఉపయోగం కోసం రూపొందించారు. వీటిలో విరిగిపోవడం కూడా తక్కువ.
సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ పరికరాలలో ప్రధాన సమస్య ఏమిటంటే అవి చాలా శబ్దం చేస్తాయి. వైట్ గూడ్స్ తో ఎన్ని సమస్యలు వస్తున్నా వాటిని వాడే వారు చాలా మంది ఉన్నారు. వాటి వినియోగానికి అతిపెద్ద కారణం వివిధ ప్రదేశాలలో వివిధ రకాల పరికరాలు, ఇతర ఉత్పత్తుల అవసరం. ప్రజలు వైట్ గూడ్స్ ను ఉపయోగించటానికి మరొక ప్రధాన కారణం ఏమిటంటే..? అవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.
బ్రౌన్ అంటే ఏమిటి..?
వైట్ గూడ్స్ లాగా, మీరు బ్రౌన్ గూడ్స్ గురించి ఏదో ఒక సమయంలో విని ఉంటారు. వాస్తవానికి, ఈ ప్రత్యేక పదం పరిమాణంలో చిన్నగా ఉండే ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ఉపయోగిస్తారు. దీనికి ఉదాహరణలు టెలివిజన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్, రేడియో, డిజిటల్ ప్లేయర్.
ఇది కూడా చదవండి:ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం..
ఇది కూడా చదవండి :ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ చేసిందెవరు..?
ఇది కూడా చదవండి:వన్ ఇయర్ లో ఇడ్లీల కోసం రూ.7.3 లక్షలు ఖర్చు చేసిన స్విగ్గీ వినియోగదారు
ఇది కూడా చదవండి :ఏప్రిల్ ఫూల్స్ డే 2024: ఫన్నీ సందేశాలతో ఏప్రిల్ ఫూల్ శుభాకాంక్షలు
ఇది కూడా చదవండి :KVS అడ్మిషన్ 2024: నేటి నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం..
ఇది కూడా చదవండి :హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రెండ్స్-ఇండియా 2023