365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ముంబై, జూలై 5,2024:ఉమెన్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫాం (WEP),ట్రాన్స్‌యూనియన్ సిబిల్ (CIBIL) కలిసి సెహెర్ (SEHER) పేరిట రుణాలపై అవగాహన కార్యక్రమాన్ని ఆవిష్కరించాయి.
భారత్‌లోని ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థిక అక్షరాస్యతపరమైన కంటెంట్‌ను అందించేందుకు, వ్యాపార నైపుణ్యాల్లో సాధికారత కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
అలాగే, తదుపరి వృద్ధి సాధించడంలో, దేశ ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాల కల్పించడంలో అవసరమైన ఆర్థిక సాధనాలను పొందేందుకు కూడా ఇది వారికి సహాయపడుతుంది.
ఉమెన్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం (WEP) అనేది నీతి ఆయోగ్‌లో ఇన్‌క్యుబేట్ చేయబడిన ఒక ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య వేదిక. భారత్‌లోని మహిళా ఎంట్రప్రెన్యూర్లకు అవకాశాలు లభించే వ్యవస్థను సృష్టించడం దీని లక్ష్యం.
మహిళా ఎంట్రప్రెన్యూర్లకు నిధుల లభ్యతను మెరుగుపర్చేందుకు, ఈ తరహా కార్యక్రమాల్లో మొదటిదైన, WEP ఫైనాన్సింగ్ ఉమెన్ కొలాబొరేటివ్ (FWC)లో ఈ ప్రోగ్రాం భాగంగా ఉంటుంది. SEHER ప్రోగ్రాంను ఉమెన్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ (WEP) మిషన్ డైరెక్టర్, నీతి ఆయోగ్ ప్రధాన ఆర్థిక సలహాదారు Ms. ఆనా రాయ్ (Ms. Anna Roy) ఆవిష్కరించారు.
జితేంద్ర అసాటి (Jitendra Asati), డైరెక్టర్ (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్), ఆర్థిక సేవల విభాగం (DFS), ఆర్థిక శాఖ; సునీల్ మెహతా, చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA); శ్రీ నీరజ్ నిగమ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI); Ms. మెర్సీ ఇపావో (Ms. Mercy Epao), సంయుక్త కార్యదర్శి, ఎంఎస్ఎంఈ శాఖ; రాజేశ్ కుమార్, ఎండీ,సీఈవో, ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
“దేశ ఆర్థిక వృద్ధికి అత్యంత ప్రాధాన్యతా రంగమైన ఎంఎస్ఎంఈల అభివృద్ధికి గల ప్రధాన అవరోధాల్లో, ఆర్థికాంశాలపై అవగాహన కొరవడటం కూడా ఒకటిగా చెబుతుంటారు. వ్యాపార వృద్ధికి అవసరమైన నిధులను సకాలంలో, మెరుగ్గా పొందాలంటే తమ సిబిల్ ర్యాంకు, కమర్షియల్, క్రెడిట్ రిపోర్టు సహా ఎంట్రప్రెన్యూర్లు ఆర్థికానికి సంబంధించిన అన్ని విషయాలపైనా పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా పెంచుకోవాలి.
సమాచార అసమతౌల్యాలను అధిగమించడంలో,ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు ప్రోత్సాహం, నిధులకు యాక్సెస్ పొందడం, మార్కెట్ లింకేజీలు, శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి, మెంటారింగ్, నెట్‌వర్కింగ్, వ్యాపార అభివృద్ధి సేవలను పొందడం వంటి కీలకాంశాల్లో తోడ్పాటు అందించడం ద్వారా మహిళా ఎంట్రప్రెన్యూర్లకు సాధికారత కల్పించాలనేది WEP లక్ష్యం” అని WEP మిషన్ డైరెక్టర్,నీతి ఆయోగ్ ప్రధాన ఆర్థిక సలహాదారు Ms. ఆనా రాయ్ వివరించారు.
“వివిధ సామాజిక-ఆర్థిక వర్గాలు, వయోగ్రూప్‌లు, భౌగోళిక ప్రాంతాలవ్యాప్తంగా మహిళా ఎంట్రప్రెన్యూర్లకు సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన ఈ విశిష్ట కార్యక్రమం కోసం ఉమెన్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫాంతో జట్టు కట్టడమనేది ట్రాన్స్‌యూనియన్ సిబిల్‌కు గర్వకారణం.
వ్యాపార వృద్ధి అనేది రుణాల లభ్యత, రుణాలపై అవగాహన,ఆర్థిక అక్షరాస్యతపై ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటుంది.
స్థిరమైన వృద్ధిని సాధించుకునేలా ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను సమర్ధమంతంగా నిర్వహించుకోవడానికి అవసరమైన ఆర్థిక పరిజ్ఞానాన్ని కల్పించడం, నైపుణ్యాలను మెరుగుపర్చడం మా లక్ష్యం.
వ్యాపారాలను ప్రారంభించడంలో, వాటిని లాభాల బాటలో ముందుకు తీసుకెళ్లడంలో మరింత మంది మహిళలకు సాధికారత అందడం ద్వారా 5 ట్రిలియన్ డాలర్ల (USD) ఎకానమీగా ఎదగాలన్న భారత్ లక్ష్య సాధనకు కూడా ఇది తోడ్పడగలదు” అని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఎండీ అండ్ సీఈవో రాజేశ్ కుమార్ తెలిపారు.
మహిళల యాజమాన్యంలోని వ్యాపారాలకు, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు తోడ్పాటు అందించడం
లఘు, చిన్న,మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈలు) శాఖకు చెందిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (URP) భారత్‌లో 6.3 కోట్ల లఘు, చిన్న,మధ్య తరహా సంస్థలు ఉన్నాయి. వీటిలో 20.5% సంస్థలు మహిళల యాజమాన్యంలో ఉన్నాయి.2.7 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
పట్టణ ప్రాంతాలతో పోలిస్తే (18.42%) గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సారథ్యంలోని ఎంట్రప్రైజెస్ (22.24%) వాటా కాస్త అధికంగా ఉన్నట్లు శాఖ వెల్లడించింది.
మహిళల ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను వేగవంతం చేయడం ద్వారా మహిళల యాజమాన్యంలో కొత్తగా 3 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ల ఏర్పాటుకు, తద్వారా మరో 15 నుంచి 17 కోట్ల వరకు ఉద్యోగాలను కల్పించేందుకు భారత్‌లో అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. యూఆర్‌పీ రిజిస్టర్డ్ యూనిట్లలో ఉద్యోగాల కల్పనలో మహిళల యాజమాన్యంలోని వ్యాపారాల వాటా 18.73%గా ఉంటోంది.
మహిళల నుంచి వ్యాపార రుణాలకు డిమాండ్ గత అయిదేళ్లలో (2019-2024 ఆర్థిక సంవత్సరాల మధ్య) 3.9 రెట్లు పెరిగినట్లు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ వ్యవధిలో, మహిళ రుణగ్రహీతల్లో వ్యాపార రుణం తీసుకున్నవారి వాటా చెప్పుకోతగ్గ స్థాయిలో 10% మేర వృద్ధి చెందింది.
2024 మార్చి నాటికి వ్యాపార రుణాలను కొనసాగిస్తున్న 1.5 కోట్ల మంది రుణగ్రహీతల్లో మహిళల వాటా 38%గా ఉంది. మహిళల వ్యాపార రుణాల పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్ ఇదే వ్యవధిలో 35% CAGR స్థాయిలో (2019 మార్చి నుంచి 2024 మార్చి వరకు) వృద్ధి చెందింది.
ట్రాన్స్‌యూనియన్ సిబిల్ కన్జూమర్ బ్యూరో గణాంకాల ప్రకారం, అగ్రి-బిజినెస్ రుణాలు, కమర్షియల్ వాహనాలు, కమర్షియల్ ఎక్విప్‌మెంట్ రుణాలు మొదలైన ఇతరత్రా సాధనాలవ్యాప్తంగా మహిళా రుణగ్రహీతల సంఖ్య స్థిరంగా 28% స్థాయిలో (మార్చి 2019 నుంచి 2024 మార్చి వరకు) ఉంది.
మహిళల సారథ్యంలోని వ్యాపారాలు వివిధ ప్రాంతాలవ్యాప్తంగా పెరిగే కొద్దీ, అవి స్థిరంగా వృద్ధి చెందాలంటే, మహిళా ఎంట్రప్రెన్యూర్లకు సత్వరంగా, సులభతరంగా, తక్కువ వ్యయాలతో కూడుకున్న నిధులను అందుబాటులోకి తేవడం అత్యంత ప్రాధాన్యతాంశం.
రుణాలపై అవగాహన పెంచే క్రమంలో, మహిళా ఎంట్రప్రెన్యూర్లకు, ఆర్థిక అక్షరాస్యత కంటెంట్ సహా వ్యక్తిగతీకరించిన వనరులు, సాధనాలను సెహెర్ అందుబాటులోకి తెస్తుంది. నిధులను వేగవంతంగా, సులభతరంగా పొందేందుకు చక్కని క్రెడిట్ హిస్టరీ, సిబిల్ స్కోరును సాధించడానికి గల ప్రాధాన్యత గురించి దేశవ్యాప్తంగా మహిళా ఎంట్రప్రెన్యూర్లకు తెలియచెప్పడం ద్వారా ఆర్థికాంశాలు, రుణాలపై అవగాహన పెంచడంలో కలిసి పని చేసేందుకు WEP , ట్రాన్స్‌యూనియన్ సిబిల్ కట్టుబడి ఉన్నాయి.