చైనాకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసుల అగ్రగామి పింగ్ యాన్‌కు చెందిన ఇన్వెస్టర్ అనుబంధం పింగ్ యాన్ వోయేజర్ ఫండ్ ,అడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు చెందిన సన్‌లే హౌస్ అనుబంధ సంస్థతో పాటు ప్రముఖ ఇన్వెస్టర్లు సీక్వోయా క్యాపిటల్ ఇండియా , హిల్‌హౌస్ క్యాపిటల్ నుంచి సమకూరిన సిరీస్ D పెట్టుబడి

365తెలుగు డాట్ కామ్, ఆన్‌లైన్ న్యూస్,డిసెంబర్ 7,న్యూఢిల్లీ, 2019:భారతదేశపు ప్రముఖ ఫుల్-స్టాక్ ఆటో-టెక్ కంపెనీ కార్‌దేఖో ఇటీవల సిరీస్ D ఫండింగ్ రూపంలో $70 మిలియన్ల నిధులు సమకూర్చుకుంది. పింగ్ యాన్‌కి చెందిన గ్లోబల్ వోయేజర్ ఫండ్ మొదటిసారిగా భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి కార్‌దేఖోను ఎంచుకుంది. అడ్వెంట్ ఇంటర్నేషనల్ అనే ప్రపంచ స్థాయి ప్రైవేట్ ఈక్విటీకి అనుబంధంగా ఉన్న సన్‌లే హౌస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ మరియు ప్రముఖ ఇన్వెస్టర్ కంపెనీలైన సీక్వోయా మరియు హిల్‌హోస్‌ కూడా ఈ పెట్టుబడిలో తమ వంతు భాగం వహించాయి. చైనాకు చెందిన పింగ్ యాన్ అనేది ప్రపంచపు అతిపెద్ద ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల్లో ఒకటిగా ఉండడంతో పాటు చైనాలోని అతిపెద్ద ఆటో పోర్టల్ ఆటోహోమ్‌లో సింహభాగం వాటాదారుగానూ ఉంటోంది. ఈ సంస్థ నుంచి పెట్టుబడిని ఆకర్షించడమే కాకుండా సీక్వోయా మరియు హిల్‌హౌస్ నుంచి కూడా  పెట్టుబుడులు ఆకర్షించడంలో కార్‌దేఖో విజయవంతమైంది. కార్‌దేఖోలో మొదట్లో పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో సీక్వోయా కూడా ఒకటి. 2013లోనే ఈ సంస్థ ద్వారా కార్‌దేఖోకి పెట్టుబడులు లభించాయి. కొత్తగా సాధించిన ఈ పెట్టుబడితో కార్‌దేఖో విలువ $250 కంటే అధిక స్థాయికి చేరింది.

కార్‌దేఖో ట్రాన్సాక్షన్ వ్యాపారాలను మరింత విస్తరించడంతో పాటు విదేశాల్లోనూ సంస్థ ఉనికిని విస్తరించడం కోసం ఈ పెట్టుబడులను ఉపయోగించనున్నారు. ఈ కంపెనీ ఇటీవలే  తన కార్యకలాపాలను ఆగ్నేయాసియాలోని రెండో దేశంలో ప్రారంభించింది. ఫిలిఫ్పైన్స్ లోని ప్రముఖ కొత్త ఆటో రంగ సంస్థ  కార్ముడిని సొంతం చేసుకోవడం ద్వారా ఆ దేశంలో కార్యకలాపాలు ప్రారంభించింది. 2016లో ఇండోనేషియాలో OTO.com అనే బ్రాండ్ పేరుతో కార్‌దేఖో కార్యకలాపాలు ప్రారంభించింది. అప్పటినుంచి ఆ దేశంలో ఇది నంబర్ వన్ న్యూ ఆటో పోర్టల్‌గా పేరు సాధించింది.

భారతదేశంలోని ఆటో రంగ పర్యావరణాన్ని కార్‌దేఖో విజయవంతంగా డిజిటిలీకరించింది. కారు కొనుగోలు, యాజమాన్యం మరియు అమ్మకం ప్రయాణం అనే విషయాల్లో వినియోగదారులు తమదైన వ్యక్తిగత సౌలభ్యం అందుకునేలా సహాయంగా నిలవడంలో ఈ సంస్థ తనదైన దార్శనికతతో ముందుకెళ్తోంది. కారు ,మోటార్‌సైకిల్ తయారీదారులందరూ కార్‌దేఖోతో కలసి పనిచేస్తుండడంతో, ఆయా తయారీ సంస్థల వార్షిక అమ్మకాల్లో 15-30% వంతు అమ్మకాలు కార్‌దేఖో ద్వారా జరుగుతున్నాయి. అలాగే, భారతదేశ వ్యాప్తంగా ఉన్న 4,000 కొత్త ఆటో డీలర్‌షిప్‌లు మరియు 3,000 పాత కార్లు విక్రయించే డీలర్లతో కలసి పనిచేయడం ద్వారా ఆయా కౌంటర్ల ద్వారా జరిగే అమ్మకాల్లో 42% పైగా అమ్మకాల్లో కార్‌దేఖో భాగం వహిస్తోంది. దీనికి తోడు, దేశవ్యాప్తంగా ఉన్న 10కి పైగా ఫైనాన్షియల్ సంస్థలు మరియు 18 ఇన్సూరెన్స్ కంపెనీలతోనూ కలసి పనిచేయడం ద్వారా పాత కార్లకు ఫైనాన్షింగ్ సౌకర్యం అందించడంతో పాటు కొనుగోలుదార్లు మరియు అమ్మకందార్లు ఇద్దరికీ ఎలాంటి ఇబ్బందులూ లేని అనుభవం అందిస్తోంది. ఆర్థిక సంవత్సరం 19-20కి ఈ కంపెనీ ఇటీవల  తన H1 ఫలితాలు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలోని మొదటి సగానికి మించి 92% వృద్ధితో ఏడాది తర్వాత సాధించిన మొత్తం ఆదాయంగా $28 మిలియన్ల ఆదాయం నమోదు చేసింది. దేశవ్యాప్తంగా కొత్త వాహనాల అమ్మకాల్లో మందగమనం ఉన్నప్పటికీ, ఈ కంపెనీ కొత్త వాహనాల వ్యాపార విభాగంలో 30% వృద్ధి నమోదు చేసింది. అలాగే, ఈ కంపెనీకి చెందిన ఇన్సూరెన్స్ మరియు వారెంటీ వ్యాపారంలో 525%, పాత కార్య వ్యాపారంలో 120% మరియు ఫైనాన్షియల్ సర్వీసుల వ్యాపారంలో 135% వృద్ధి నమోదైంది.

“భారతదేశంలో పూర్తి స్థాయి ఆటోటెక్ కంపెనీగా ఉన్న కార్‌దేఖోలో మేము కారు కొనుగోలు ,అమ్మకం అనే ప్రయాణంలో వినియోగదారులకు సాయంగా నిలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాము. మా విశిష్ట ఆటోమొబైల్ పర్యావరణం అనేది వినియోగదారులకు విశ్వసనీయమైన విలువ ప్రతిపాదనలు అందించడంతో పాటు ఒకే వేదిక ద్వారా మా విభిన్న లావాదేవీల నమూనాల ద్వారా వారికి అవసరమైన సహకారం అందిస్తాము. తాజాగా సాధించిన ఈ నిధులతో, మేము మా స్వదేశీ , అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలను పటిష్టం చేయడంతో పాటు దేశంలో అతిపెద్ద వ్యక్తిగత మొబిలిటీ ఎకోసిస్టమ్‌గా రూపొందడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాము” అని కార్‌దేఖో CEO మరియు కో-ఫౌండర్ అమిత్ జైన్ అన్నారు.

“పింగ్యాన్ ‘ఫైనాన్స్ + పర్యావరణ’ వ్యూహంలో ఆటో సర్వీసులనేవి కీలక అంశంగా ఉంటోంది. చైనాలోని ఆటోహోమ్‌లో మా మా మెజారిటీ వాటాలు ఉండడం ఇదే విషయాన్ని ప్రతిఫలిస్తుంది. భారతదేశంలో కార్‌దేఖో తన వ్యాపారాన్ని నిర్మించిన విధానం మాకు చాలా బాగా నచ్చింది. ప్రత్యేకించి కారు కొనుగోలుదార్ల అవసరాలు తీర్చేలా ఆ సంస్థ రూపొందించిన విభిన్న రకాల ఫైనాన్షియల్ సర్వీసులు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి” అని పింగ్యాన్ గ్లోబల్ వోయేజర్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు COO డొనాల్డ్ లేసీ అన్నారు. కార్‌దేఖోలో గ్లోబల్ వోయేజర్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది భారతదేశంలో పింగ్ యాన్ మొదటి వెంచర్ ఇన్వెస్ట్మెంట్‌గా ఉంటోంది. కార్‌దేఖో లాంటి ఒక సమర్థవంతమైన సంస్థతో భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉంది అని కూడా ఆయన అన్నారు.

 “కార్‌దేఖో అనేది భారతదేశంలోని కారు కొనుగోలు పర్యావరణంలో కేంద్రంగా ఉంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆటో బ్రాండ్లు, డీలర్లు మరియు వినియోగదార్లను ఈ సంస్థ తన పోర్టళ్ల ద్వారా ఒకే వేదిక మీదకు తీసుకొస్తోంది” అని సన్లే హౌస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ అంజర్వాలా అన్నారు. “ఆటో పరిశ్రమలు వాటి డిజిటల్ ప్రకటనల కోసం చెప్పుకోదగ్గ మొత్తంలో ఖర్చు చేస్తుండడంతో పాటు భారతదేశంలో వ్యాపార ప్రకటనలు డిజిటల్ ఛానెళ్లకు తరలి వెళ్తుండడం అనేది ఈ కంపెనీ ఒక పటిష్టమైన వృద్ధిని నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యధిక-వృద్ధి వ్యాపారాలు నిర్మించే దిశగా మా గ్లోబల్ నెట్‌వర్క్ మరియు అనుభవం అందించడం ద్వారా కార్‌దేఖోకి సాయం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని కూడా ఆయన అన్నారు.

“పాత, కొత్త వాహనాల విక్రయాల రంగంలో కార్‌దేఖో తన వ్యూహాన్ని అత్యద్భుతంగా అమలు చేస్తోంది. కార్‌దేఖోతో భాగస్వామ్యం కోసం పింగ్ యాన్ , సన్‌లే హౌస్ ముందుకు రావడాన్ని మేము సంతోషంగా ఆహ్వానిస్తున్నాము. భారతదేశంలోని వినియోగదారులు కారు కొనుగోలు ,అమ్మకం అనే అనుభవాన్ని అత్యంత సౌకర్యవంతంగా ,సమర్థంగా చేయడానికి కార్‌దేఖో చేస్తున్న ప్రయత్నానికి మా మద్దతు , తోడ్పాటు మరింతగా అందించడానికి మేము ఆసక్తిగా ఉన్నాము” అని సీక్వోయా క్యాపిటల్ ఇండియా అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ షైలేశ్ లఖానీ అన్నారు.  రెయిన్‌మేకర్ గ్రూప్ అనేది ఈ కంపెనీకి ఏకైక ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తోంది.