365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 13,2024: సంధ్య థియేటర్లో “పుష్ప 2” ప్రీమియర్ షో సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 39 ఏళ్ల రేవతి మరణించడంతో పాటు, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రేవతి భర్త భాస్కర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
భాస్కర్ తన ఫిర్యాదులో పేర్కొన్నది ప్రకారం, “పుష్ప 2” ప్రీమియర్ చూడటానికి తన భార్య, పిల్లలతో సంధ్య థియేటర్‌కు వెళ్ళారు. అదే సమయంలో హీరో అల్లు అర్జున్ థియేటర్ సందర్శనకు రావడం, అప్పటికే థియేటర్ ప్రేక్షకులతో నిండిపోవడం ఈ ప్రమాదానికి కారణమయ్యాయి.
![](http://365telugu.com/wp-content/uploads/2024/12/Pushpa2.jpg)
భాస్కర్ ఆరోపణలు:
- సరైన ప్రణాళిక లేకపోవడం: థియేటర్ యాజమాన్యం ముందస్తు ప్రణాళికలు లేకుండా, అదనంగా ప్రేక్షకులను అనుమతించడంతో తొక్కిసలాటకు కారణమయ్యింది.
- వసతులా లేకపోవడం: ప్రేక్షకుల కోసం సరైన వసతులు కల్పించకపోవడం.
- సీట్లు లేకపోవడం: నిబంధనలకి విరుద్ధంగా ఎక్కువ మంది ప్రేక్షకులను అనుమతించడం.
- తొక్కిసలాటకు కారణమైనవారు: అల్లు అర్జున్, ఆయన వ్యక్తిగత సిబ్బంది, థియేటర్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భాస్కర్ కోరారు.
![](https://365telugu.com/wp-content/uploads/2024/12/image-4.png)
![](http://365telugu.com/wp-content/uploads/2024/12/Pushpa2.jpg)
ఈ ఘటనపై భార్య మరణం, శ్రీతేజ గాయాలు జరిగేందుకు కారకులైనవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని భాస్కర్ విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనపై బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు అల్లు అర్జున్ ప్రకటించారు.
పోలీసులు బన్నీని (అల్లు అర్జున్ను) శుక్రవారం అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ కేసు సంబంధించిన ఎఫ్ఐఆర్, ఫిర్యాదు కాపీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.