365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి9,హైదరాబాద్: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాయి. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ జరుగుతున్నది. ప్రధాన తారాగణంపై ముఖ్యఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు.
విజయ్ దేవరకొండ కథానాయకుడు, అనన్యపాండే కథానాయిక.ఇప్పటివరకు దాదాపు 40రోజుల పాటు జరిగిన షూటింగ్‌లో కీలక ఎపిసోడ్స్‌తో పాటు భారీ యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించారు. ఈ షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండతో పాటు రమ్యకృష్ణ, అనన్యపాండే, రోణిత్‌రాయ్, అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో విజయ్‌దేవరకొండ బాక్సర్‌గా కనిపించబోతున్నారు. ఇందుకోసం ఆయన థాయ్‌లాండ్‌కు వెళ్లి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రానికి ‘ఫైటర్’ వర్కింగ్ టైటిల్‌గా ప్రచారంలో ఉంది. విష్ణురెడ్డి, మకరంద్‌దేశ్‌పాండే, గెటప్‌శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: విష్ణుశర్మ, ఫైట్స్: కెచ్చా, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్‌జోహార్, అపూర్వమోహతా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరిజగన్నాథ్.
ఇప్పటివరకు దాదాపు 40రోజుల పాటు జరిగిన షూటింగ్‌లో కీలక ఎపిసోడ్స్‌తో పాటు భారీ యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించారు. ఈ షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండతో పాటు రమ్యకృష్ణ, అనన్యపాండే, రోణిత్‌రాయ్, అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో విజయ్‌దేవరకొండ బాక్సర్‌గా కనిపించబోతున్నారు. ఇందుకోసం ఆయన థాయ్‌లాండ్‌కు వెళ్లి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రానికి ‘ఫైటర్’ వర్కింగ్ టైటిల్‌గా ప్రచారంలో ఉంది. విష్ణురెడ్డి, మకరంద్‌దేశ్‌పాండే, గెటప్‌శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: విష్ణుశర్మ, ఫైట్స్: కెచ్చా, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్‌జోహార్, అపూర్వమోహతా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరిజగన్నాథ్.