365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 2,2025: కాలం మారుతున్న వేళ ఆయుర్వేద పద్ధతుల్లో సమతుల్య ఆహారం ఎంతో ముఖ్యం. శీతాకాలం నుంచి వసంత ఋతువుకు మారుతున్న సమయంలో శరీరంలో వచ్చే మార్పులను సమతుల్యం చేయడం అవసరం.

ఉష్ణోగ్రత మార్పులు జీర్ణక్రియపై ప్రభావం చూపుతూ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఈ దశలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరికొత్త ఆహార ప్రణాళికను పాటించడం మంచిది.
ఇంట్లో తయారుచేసిన నెయ్యి, ఆకుకూరలు, కూరగాయల సూప్‌లు, బాదం వంటి ప్రోటీన్ వనరులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ మధుమిత కృష్ణన్ సూచిస్తున్నారు.

Read this also…Mahindra Auto Achieves 23% Growth in March 2025, Sells 83,894 Vehicles, Including 48,048 SUVs

Read this also…Mahindra Farm Equipment Sector Achieves Record-Breaking Sales in FY25 with 407,094 Units Sold

ఇది కూడా చదవండి..లక్ష మంది ఇంటి పన్ను డిఫాల్టర్లపై కఠిన చర్యలు – నీరు, మురుగునీటి కనెక్షన్లు నిలిపివేత!

ఈ ఏడాది కాలానికి అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన 7 రోజుల ఆయుర్వేద ఆహార ప్రణాళిక మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించేలా చేస్తుంది.

అయితే ప్రతి ఒక్కరి శరీర నిర్మాణం భిన్నంగా ఉంటుందని, అందువల్ల అవసరాలను అనుసరించి ఈ డైట్‌ను స్వల్ప మార్పులతో అనుసరించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఏడు రోజుల ఆయుర్వేద ఆహార ప్రణాళిక
► 1వ రోజు:

అల్పాహారం: మెంతి, పెరుగుతో తయారుచేసిన థెప్లా

భోజనం: పాలక్-పనీర్ కర్రీ, జొన్న రోటీ, తాజా కూరగాయల సలాడ్, కొన్ని బాదం

రాత్రి భోజనం: మూంగ్ దాల్ ఖిచ్డి, ఉడికించిన బీట్‌రూట్ క్యారెట్ కూర

► 2వ రోజు:

అల్పాహారం: బాదం, అల్లం, దాల్చిన చెక్కతో మసాలా ఓట్స్ గంజి

భోజనం: రజ్మా కర్రీ, జీరా రైస్, ఆకుకూరలు

రాత్రి భోజనం: బజ్రా కిచ్డి, బీట్‌రూట్ రైతా

► 3వ రోజు:

అల్పాహారం: బాదం పాలతో ఇంట్లో తయారుచేసిన ముస్లీ లేదా క్యారెట్ పరాఠా

ఇది కూడా చదవండి..భారతదేశంపై ట్రంప్ కొత్త వ్యూహం.. వ్యవసాయ ఉత్పత్తులపై 100% సుంకం..?

ఇది కూడా చదవండి..కొత్త UPI నిబంధనలు అమల్లో.. Google Pay, PhonePe, Paytm వినియోగదారులు ఇది తప్పక తెలుసుకోవాలి!

భోజనం: చనా మసాలా, గోధుమ చపాతీ, సీజనల్ వెజిటబుల్ సలాడ్

రాత్రి భోజనం: క్యారెట్-అల్లం సూప్, కూరగాయల వేపుడు

► 4వ రోజు:

అల్పాహారం: పుదీనా చట్నీతో బేసన్ చిల్లా

భోజనం: మునగకాయ సాంబార్, రైస్, ఆకుకూరలు

రాత్రి భోజనం: కొబ్బరి పాలు, నల్ల మిరియాలతో కూరగాయల వంటకం

► 5వ రోజు:

అల్పాహారం: మిల్లెట్ ఉప్మా, నల్ల మిరియాలు, నెయ్యి

భోజనం: పెసర పప్పు కూర, టర్నిప్, క్యారెట్, బాదం తో చపాతీ

రాత్రి భోజనం: దాల్ కిచ్డీ, బీట్‌రూట్ రైతా

► 6వ రోజు:

అల్పాహారం: నెయ్యి, బెల్లం, బాదం, యాలకులతో తయారుచేసిన క్షీర

భోజనం: మునగకాయ కూర, బజ్రా రోటీ, సలాడ్

రాత్రి భోజనం: పాలకూర, గోధుమ రొట్టెతో శనగపిండి చీలా

► 7వ రోజు:

అల్పాహారం: పసుపు, నల్ల మిరియాలతో వండిన పోహా

భోజనం: మెంతి సెనగలు కూర, గోధుమ రోటీ, తాజా సలాడ్

రాత్రి భోజనం: ఆకుకూరలు, పప్పు సూప్, రైస్

ఆహార ప్రణాళికలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు:ఆరు రుచులు (తీపి, పులుపు, ఉప్ప, చేదు, ఘాటు, వగరు) ఉండేలా చూసుకోవాలి.

వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మెనూను మార్చుకోవచ్చు.

కాలానుగుణ ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఈ ఆయుర్వేద ఆహార ప్రణాళిక ఉపయుక్తంగా ఉంటుంది.

ఈ సులభమైన ఆహార నియమాలను పాటిస్తూ, మారుతున్న కాలానికి తగ్గట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు!