365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,మార్చి 30,2022:తన సభ్యులకు సౌలభ్యంతో కూడిన విలువను అందించే ప్రయత్నాల్లో భాగంగా,భారతదే శంలోని స్వదేశీ ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌కు డిజిటల్ బీ2బి మార్కెట్‌ప్లేస్‌గా కొనసాగుతు న్న ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, తన సభ్యుల కోసం సేవ్‌ఈజీ (SaveEazy) అనే ప్రత్యేకమైన/ఇన్వైట్-ఓన్లీ లాయల్టీ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. మొట్టమొదటి రకం (లేదా ఎఫ్‌కెడ బ్ల్యూ నుంచి వచ్చిన వచ్చిన మొదటి ప్రోగ్రామ్) సేవ్‌ఈజీ, ఆఫ్‌లైన్ ,ఆన్‌లైన్ (ఇసేవ్ ఈజీ) రీడీమ్ చేయగల విస్తృత శ్రేణి విలువ-ఆధారిత కూపన్‌లను అందించే ఇన్వైట్- ఆధారిత లాయల్టీ ప్రోగ్రామ్. ఈ ప్రయత్నం ద్వారా, సేవ్‌ఈజీ సభ్యులు ఇప్పుడు రోజువారీ తక్కువ ధర ఆఫర్‌ల కన్నా ఎక్కువ ముఖ్యమైన ప్రయోజనాలను పొందుతా రు.
లాయల్టీ ప్రోగ్రామ్‌ను పరిచయం చేస్తున్న నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ సీనియర్ ఉపాధ్యక్షుడు,అధికారి ఆదర్శ్ మీనన్ మాట్లాడుతూ, ‘‘భారతీయులకు షాపింగ్ అనేది ఒక భావోద్వేగ నిర్ణయమని మా పరిశోధన తెలియజేస్తోంది. రివార్డింగ్ షాపింగ్ బ్రాండ్‌తో సానుకూల భావోద్వేగ బంధాన్ని ప్రేరేపిస్తుంది. సేవ్‌ఈజీ లాయల్టీ ప్రోగ్రామ్ మా విశ్వసనీయ సభ్యులకు రివార్డ్ ఆఫర్, అలాగే దాని ప్రత్యేక ప్రయోజనాలు గొప్ప విలువను,ఉన్నతమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తాయి. ఈ ప్రోగ్రామ్‌లు మా వినియోగదారుల సంబంధాలను పెంపొందించేందుకు,ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌లో షాపింగ్ చేయడానికి అనుగుణంగా పరిచయం చేస్తున్నాము’’ అని వివరించారు.
సేవ్ ఈజీ క్లబ్ రెండు విభాగాలలో సభ్యత్వాన్ని అందిస్తుంది: క్లాసిక్,ప్రీమియం.
రూ.999కు లభించే క్లాసిక్ లాయల్టీ క్లబ్ మెంబర్‌షిప్ కేటగిరీ కింద, సభ్యులు రూ.250 విలువైన 12 కూపన్‌లను పొందుతారు. ప్రతి కూపన్‌కు ఒక నెల వ్యాలిడిటీ ఉంటుంది. రూ.2,499కు లభించే ప్రీమియం లాయల్టీ క్లబ్ మెంబర్‌షిప్ కేటగిరీ కింద, సభ్యులు రూ.400 విలువైన 12 కూపన్‌లను అందుకుంటారు. ఒక్కో కూపన్‌కు ఒక నెల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రీమియం సభ్యులకు స్టోర్‌లలో ప్రాధాన్యత చెక్అవుట్ కూడా అందించబడుతుంది. ఈ కేటగిరీ కింద రిడంమ్షన్‌కు కనీస బిల్లు విలువ రూ.11,000.
సేవ్‌ఈజీ క్లబ్ లాయల్టీ ప్రోగ్రామ్ కింద స్టోర్లలో వారి కూపన్‌లను ఆఫ్‌లైన్‌లో సేకరించడం,రీడీమ్ చేయడంతో పాటు, ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ సభ్యులు ఇ-సేవ్‌ఈజీ ప్రోగ్రామ్‌ను కూడా ఎంచుకోవచ్చు. వినియోగదారులు తమ క్లాసిక్ లేదా ప్రీమియం ఆహ్వానాలను ఉచితంగా ఇ-సేవ్‌ఈజీ క్లాసిక్/ప్రీమియానికి అప్‌గ్రేడ్ చేసేందుకు , అదే స్థాయిలో ప్రయోజనాలను అందుకునేందుకు అవకాశాన్ని కలిగి ఉంటారు.
ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ప్రారంభించిన హోల్‌సేల్ రిటైల్ కిరాణా,చిన్న వ్యాపారాలు ఇ-
కామర్స్ పర్యావరణ వ్యవస్థలో భాగం అయ్యేందుకు,సాంకేతికత వినియోగం ద్వారా
సృష్టించబడిన సినర్జీలు,విలువ నుంచి ప్రయోజనం పొందే అవకాశాన్ని అందిస్తుంది.