365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 17,2024: భారత్‌లోని ప్రముఖ ఇథనాల్ ఆధారిత రసాయనాల తయారీ దిగ్గజాల్లో ఒకటైన గోదావరి బయోరిఫైనరీస్ లిమిటెడ్ తమ ముసాయిదా రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ని మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి సమర్పించింది.
ఫ్రాస్ట్ అండ్ సలివాన్ నివేదిక ప్రకారం 2024 మార్చి 31 నాటికి స్థాపిత సామర్ధ్యంపరంగా కంపెనీ భారత్‌లోనే అతి పెద్ద సమీకృత బయో-రిఫైనరీగా, అలాగే ఎంపీవో (3 మీథైల్-3 పెంటీన్-2-వన్) ఉత్పత్తికి సంబంధించి స్థాపిత సామర్ధ్యంపరంగా ప్రపంచంలోనే అతి పెద్ద తయారీదారుగా ఉంది.
సహజసిద్ధమైన 1,3 బుటిలీన్ గ్లైకాల్‌ను తయారు చేసే రెండు సంస్థల్లో ఒకటిగా, అలాగే భారత్‌లో బయో ఈథైల్ ఎసిటేట్‌ను తయారు చేసే ఏకైక కంపెనీగా గోదావరి బయోరిఫైనరీస్ ఉంది.
రూ. 10 ముఖ విలువ చేసే ఈక్విటీ షేర్ల జారీ ద్వారా నిధులు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. మొత్తం ఇష్యూలో భాగంగా రూ. 325 కోట్ల వరకు విలువ చేసే ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుండగా ఆఫర్ ఫర్ సేల్ కింద 65,26,983 ఈక్విటీ షేర్ల విక్రయం ఉంటుంది.
తాజా ఇష్యూ ద్వారా నికరంగా వచ్చే నిధులను (i) రూ. 240 కోట్ల వరకు పొందిన నిర్దిష్ట రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా రీపేమెంట్/ప్రీపేమెంట్ చేసేందుకు ,మిగతా మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకోసం వినియోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది.
ఆఫర్ ఫర్ సేల్ కింద మండల క్యాపిటల్ ఏజీ లిమిటెడ్ (ఇన్వెస్టర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్లు) 49,26,983 షేర్ల వరకు, సోమయ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5,00,000 షేర్ల వరకు, సమీర్ శాంతిలాల్ సోమయ 2,00,000 షేర్ల వరకు, లక్ష్మీవాడి మైన్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2,00,000 షేర్ల వరకు (ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్లు), ఫిల్మీడియా కమ్యూనికేషన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3,00,000 ఈక్విటీ షేర్ల వరకు, సోమయ ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1,00,000 షేర్ల వరకు (ప్రమోటర్ గ్రూప్ సెల్లింగ్ షేర్‌హోల్డర్లు) విక్రయించనున్నారు.
ఈ ఐపీవోకి ఈక్విరస్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి.
ఫ్రాస్ట్ & సలివాన్ నివేదిక ప్రకారం కంపెనీ భారత్‌లో తొలి బయో ఆధారిత ఈవీఈ (ఈథైల్ వినైల్ ఎథర్స్) తయారీ ప్లాంటును 2024 మార్చి 31న ఏర్పాటు చేసింది. భారత్‌లో ఈవీఈ దిగుమతులకు ప్రత్యామ్నాయంగా అవకాశాలను అందిపుచ్చుకోనుంది.
Also read : GODAVARI BIOREFINERIES LIMITED FILES DRHP WITH SEBI
Also read :KBC Global Ltd has been awarded a sub contract worth of USD20 Million for soft infrastructure segment from CRJE Ltd
Also read :Alembic Pharmaceuticals announces USFDA Final Approval for Icatibant Injection
Also read : Hyderabad’s popular neighborhood stores now available on PhonePe’s Pincode App
ఇది కూడా చదవండి : హైదరాబాద్ అంతటా ఈద్-ఉల్-అదాను ఘనంగా వేడుకలు
ఇది కూడా చదవండి : బెంగాల్‌లో గూడ్స్ రైలును కాంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఐదుగురు మృతి, పలువురు గాయాలు…
ఇది కూడా చదవండి : ఫాదర్స్ డే 2024 ప్రత్యేక సందేశాలు, కోట్స్..